ఐపీఎల్ 2023 సీజన్ లో గత మూడు రోజులుగా సాగుతున్న మ్యాచ్ లు హోరాహోరీ ఫైట్ తో ఫ్యాన్స్ కి ఫుల్లు కిక్కుని అందిస్తున్నాయి. గుజరాత్-కోల్ కతా మధ్య జరిగిన మ్యాచ్ మరవకే ముందే ఆర్సీబీ-లక్నో మ్యాచ్ కూడా ఆ రేంజ్ లోనే సాగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్సివెల్ దంచి కొట్టి హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆర్సీబీ 212 పరుగులతో భారీ స్కోర్ చేసింది. ఇంత టార్గె్ట్ కొట్టిన తర్వాత ఏ టీమ్ అయినా ఓడిపోతుందని అనుకుంటారు..ఆరంభంలో సిరాజ్ వేన్ పార్నెల్ వరుస వికెట్లు తీయడంతో అట్టర్ ప్లాప్ అయిన లక్నో సూపర్ జెయింట్స్ టీమ్. 105 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
Read Also : Arunachal Pradesh: అమిత్ షా అరుణాచల్ పర్యటనపై చైనా అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా మంది గుండెల మీద చేయి వేసుకుని పడుకున్నారు. అయితే ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. నికోలస్ పూరన్ సిక్సర్ల మోత, అతనికి తోడు ఆయూష్ బదోని మంచి సపోర్ట్ ఇవ్వడంతో లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ ఇద్దరు వెంటవెంటనే అవుట్ కావడంతో మ్యాచ్ ఆఖరి బంతి వరకు వెళ్లింది. లాస్ట్ ఓవర్ లో జరిగిన హైడ్రామా వేరే లెవెల్. 5 పరుగులు కావాల్సిన దశలో రెండో బంతికి వికెట్ పడింది. ఒక్క పరుగు కావాల్సిన సమయంలో మరో వికెట్ పడడంతో ఐపీఎల్ 2023 సీజన్ లో సూపర్ ఓవర్ మ్యాచ్ చూడవచ్చని ఫ్యాన్స్ అనుకున్నారు. అప్పటికే టైం 11.30 అవుతుంది.
Read Also : Arunachal Pradesh: అమిత్ షా అరుణాచల్ పర్యటనపై చైనా అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
చాలా మంది మ్యాచ్ గురించి మరిచిపోయి మంచి నిద్రలో ఉండేలోకి వెళ్లి ఉండొచ్చు. ఆఖరి ఓవర్ లో మ్యాచ్ సూపర్ ఓవర్ దిశగా సాగుతుందని తెలియడంతో ఒక్కసారిగా మొబల్స్ లో ఆన్ అయిపోయాయి. 1 కోటి రియల్ టైమ్ వ్యూస్.. ఏకంగా 1.8 కోట్లకు చేరుకుంది. ఐపీఎల్ లో ఇదే అత్యధికం.. ఇంతకు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో వచ్చి 3 బంతుల్లో 2సిక్సర్లు కొట్టి అవుట్ అయిన ఎంఎస్ ధోని బ్యాటింగ్ చేసే టైంలో జియో రియల్ టైం వ్యూస్ 1.7 కోట్లను తాకింది.
Read Also : Vidudala: క్లైమాక్స్ లో ఎమోషన్ కి కనెక్ట్ అయి చప్పట్లు కొట్టేశాను: అల్లు అరవింద్
అంతకు ముందు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రియల్ టైం వ్యూస్ 1.6 కోట్లుగా ఉంది. అయితే సూపర్ థ్రిల్లర్ మ్యాచ్ కావడంతో చాలా మంది మొబైల్స్ ఆటోమేటిక్ గా ఆన్ అయిపోయాయి.. దీంతో మహీ రికార్డ్ ను ఆర్సీబీ అర్థరాత్రి పూట లేపేసింది. అయితే నెక్ట్స్ చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. రాజస్థాన్ మంచి ఫామ్ లో ఉంది. ఇరుజట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ లో మహీ బ్యాటింగ్ కు వస్తే ఆర్సీబీ రికార్డ్ బ్రేక్ అవుతుందో లేదో చూడాలి..