ఈ సెంచరీ మొనగాళ్లు, వికెట్ల వీరులు డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో ఇదే ఫామ్ ను కొనసాగిస్తారా..? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరిగే ది ఓవల్ గ్రౌండ్ బంతితో పాటు బ్యాటింగ్ కు కూడా అనుకూలంగా ఉంటుంది.
టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా గత కొంతకాలంగా తన గర్ల్‌ఫ్రెండ్ నిధి తపాడియాతో రిలేషిన్‌షిప్‌లో ఉన్నారు. అయితే తొలిసారి వీరిద్దిరూ పబ్లిక్‌గా కనపడ్డారు. ఐఐఎఫ్‌ఏ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పృథ్వీ షా, నిధి తపాడియా సందడి చేశారు.
ఐపీఎల్ 2023 ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో ఆకాష్ మధ్వల్ పేరు మారిమ్రోగిపోయింది. 3.3 ఓవర్లలో 5 పరుగులిచ్చి 5 వికెట్లను తీసుకుని.. అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. అయినా ఆ జట్టు ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల ఫలితాలపైనే ఇతర జట్ల ప్లే ఆఫ్స్ ఆధారపడి ఉన్నాయి. అందుకే, హైదరాబాద్ ఆడే మ్యాచులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ తన సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ తలపడుతుంది.
ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన లిస్ట్ లో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా తాజాగా దినేశ్ కార్తీక్ చేరాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఇవాళ రాత్రి 7: 30 గంటలకు.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఓ భారీ రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 12 పరుగులు చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా ఘనత సృష్టించనున్నాడు.
రాహుల్ ఐపీఎల్ 2023కి దూరం అయ్యాడు. రాహుల్ ఫ్రాంచైజీని విడిచిపెట్టి స్కానింగ్ కోసం ముంబైకి బయలుదేరాడు. క్రిక్‌బజ్ నివేదిక నుంచి ఈ సమాచారం అందింది. ఫీల్డింగ్‌లో గాయపడిన కేఎల్ రాహుల్ గాయాన్ని పర్యవేక్షించడం ఇప్పుడు బీసీసీఐ చేతిలో ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్స్ లిస్ట్‌లో రాహుల్ చేర్చబడ్డాడని, అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపికైన జట్టులో అతను ఉన్నాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ సునాయసంగా గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది. 6 బంతుల్లో 9 పరుగులు చేయలేక ఓడిపోయింది. ఈ ఓటమి నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పేరు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌కు హాజరైన ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మైదానంలో తన హావ భావాలతో అందర్నీ ఆకట్టుకుంది. వికెట్ కోల్పోయినప్పుడు బాధపడి.. బౌండరీలు బాదినప్పుడు ఎగిరి గంతేసింది కావ్య పాప. కానీ మ్యాచ్…