పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ హైదారాబాద్ అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు.. ఆదివారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి ఆఖరి వరకు నిలిచి 66 బంతుల్లో 99 పరుగులు చేసిన ధావన్ ఇన్సింగ్స్ లో 12 ఫోర్లు 5 సిక్సులు ఉన్నాయి. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం ఒంటరిపోరాటం చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. ఈ క్రమంలో ఒక్క పరుగు దూరంలో సెంచరీ మార్కుకు దూరమైనప్పటికి కెరీర్ లోనే బెస్ట్ ఇన్సింగ్స్ ఆడాడు. ముఖ్యంగా 88 పరుగులకే పంజాబ్ తొమ్మిది వికెట్లు కోల్పోయిన.. ధావన్ మాత్రం చివరి బ్యాటర్ తో కలిసి పదో వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యం అజేయంగా జోడించాడు.
Also Read : CM KCR: యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి..
ఇక ఎస్ ఆర్ హెచ్ పై 99 పరుగుల ఇన్సింగ్స్ తో ధావన్ కోహ్లీ రికార్డును బద్దులు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్ సాధించిన టీమిండియా ఆటగాడిగా ధావన్ నిలిచాడు. ఇప్పటి వరకు కోహ్లీ ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు 50 సార్లు చేయగా.. తాజాగా శిఖర్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టి 51 వ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ సాధించాడు. కాగా 50 ప్లస్ స్కోర్లు చేయడానికి కోహ్లీ 216 ఇన్సింగ్స్ లు తీసుకోగా.. ధావన్ మాత్రం 206 ఇన్సింగ్స్ లోనే ఈ ఘనత సాధించాడు. ఇక తొలి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో 60 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేశాడు. హైదరాబాద్ ప్రజలు నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ఇది నా కెరీర్ లోనే బెస్ట్ ఇన్సింగ్స్ అనుకుంటున్నా.. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరోదశలో ఒత్తిడి అనిపించింది.. కానీ ఏమైనా సరే చివరి వరకు నిలబడాలనుకున్నా.. అందుకే వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడాను అని శిఖర్ ధావన్ చెప్పాడు. సెంచరీ మార్క్ మిస్ కావడం కంటే ఒక గొప్ప ఇన్సింగ్స్ ఆడానన్న సంతోషం ఎక్కువగా ఉంది.. అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : Bhakthi TV Stothra parayanam live: సోమవారం నాడు ఈ స్తోత్రపారాయణం చేస్తే వంశాభివృద్ధి