విశాఖపట్టణం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 209 పరుగుల భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 210 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఉంచింది.
ఐపీఎల్ 2025 మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ముంబై ఇండియన్స్ జట్టు సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉంటుంది. గత ఐపీఎల్ సీజన్‌లో మూడోసారి స్లో ఓవర్ రేట్‌ను ఉల్లంఘించినందుకు ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. ఈ నిషేధం కారణంగా, హార్దిక్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మొదటి…
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్ గురించి మరోసారి ఓపెన్ అయ్యాడు. 43 ఏళ్ల ఎంఎస్ ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అప్పటి నుంచి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. గత సీజన్ తనకు చివరి సీజన్ అవుతుందని క్రికెట్ అభిమానులు భావించినప్పటికీ.. రిటైర్మెంట్‌ను ప్రకటించలేదు. 2025 సీజన్ కూడా ఆడనున్నాడు. ఈ ఎడిషన్ ముగిసిన తర్వాత ఆటకు గుడ్‌బై చెబుతాడని మళ్లీ గుసగుసలు మొదలయిన…
హైదరాబాద్ క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న తరణం రానే వచ్చింది. ఉప్పల్ లో తొలి మ్యాచ్ కు అంతా రెడీ అయ్యింది. నేడు సన్‌రైజర్స్ Vs రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది. నేడు ఉప్పల్ వేదికగా మ.3:30కి సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఐపీఎల్ 17వ సీజన్ లో రన్నరప్ గా నిలిచిన…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ప్రారంభమైంది. 2008లో ప్రారంభమైన ఈ మెగా లీగ్.. ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకుంది. 8 జట్లతో మొదలైన ఈ లీగ్ లో ప్రస్తుతం పది టీమ్స్ ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడతున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి మరో రికార్టు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో విరాట్ 400వ మ్యాచ్ ఆడుతున్నాడు.…
మరి కొన్ని నిమిషాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఘనంగా ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభ మ్యాచ్ జరగడం ఇది రెండోసారి. టోర్నమెంట్ మొదటి సీజన్ 2008లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అప్పుడు కేకేఆర్ భారీ తేడాతో గెలిచింది. 2008 ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో బ్రెండన్ మెకల్లమ్ కేకేఆర్ తరఫున 158 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.
ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ ఈరోజు (మార్చి 22, శనివారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనుంది. 18వ సీజన్.. కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. అయితే.. వర్షం అభిమానుల ఉత్సాహాన్ని క్షీణింపజేస్తోంది. గత రెండు రోజులుగా కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన యాంటీ సైక్లోనిక్ ప్రసరణ కారణంగా మార్చి 22 వరకు కోల్‌కతాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ…
రేపు జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ టిక్కట్లను విచ్చలవిడిగా బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న భరద్వాజ్ అనే వ్యక్తిని ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. అనంతరం.. అతని వద్ద నుంచి టికెట్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఐపీఎల్ ఫీవర్ స్టార్టైందంటే టాలీవుడ్ బాలీవుడే కాదు టోటల్ బాక్సాఫీస్ కి చలి జ్వరం మొదలైనట్లే. యూత్, క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. దీంతో థియేటర్లు వెలవెలబోతుంటాయి. అందుకే ఐపీఎల్ షెడ్యూల్ రాగానే ఆ టైంలో స్లాట్ బుక్ చేసుకున్న బొమ్మలు సందిగ్థంలో పడ్డాయి. మార్చి 22 నుండి మే25 వరకు మ్యాచులు జరగబోతున్నాయి. ఈ టైంలో రిస్క్ చేయడం ఎందుకులే అని కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. వాటిల్లో ఒకటి అక్షయ్ కుమార్ జాలీ…
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలి గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఒక ఆసక్తికరమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ దూకుడు విధానాన్ని విరాట్ కోహ్లీ అవలంబించకూడదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు.