విశాఖపట్టణం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 209 పరుగుల భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 210 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఉంచింది. LSG బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ బౌలర్లకు ఊచకోత చూపించారు. ఢిల్లీ బౌలర్లను ఈ ఇద్దరు బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. పూరన్ 30 బంతుల్లో 75, మార్ష్ 36 బంతుల్లో 72 పరుగులతో చెలరేగారు. పూరన్ ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. మార్ష్ ఇన్నింగ్స్‌లో 6 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి.
Read Also: Adah Sharma : బాక్సాఫీస్ కలెక్షన్ల గోల అవసరమా.. ఆదాశర్మ షాకింగ్ కామెంట్స్
లక్నో బ్యాటింగ్‌లో ఈ ఇద్దరు బ్యాటర్లు తప్ప మిగతా బ్యాట్స్ మెన్లు రాణించలేదు. చివర్లో డేవిడ్ మిల్లర్ 27 పరుగులతో రాణించాడు. మార్క్రమ్ 15, షాబాజ్ అహ్మద్ 9 పరుగులు చేశారు. మరోవైపు.. మొదట్లో పరుగులు సమర్పించుకున్న ఢిల్లీ బౌలర్లు.. 10 ఓవర్ల తర్వాత కట్టడి చేశారు. అంతేకాకుండా.. వికెట్లు కూడా పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 2.. విప్రాజ్ నిగం, ముఖేష్ కుమార్ తలో వికెట్ తీశారు.
Read Also: Shalini Pandey : స్టైలిష్ డ్రెస్ లో షాలినీ పాండే.. ఆ ఫోజులు చూశారా..