ఐపీఎల్ మెగా వేలం (IPL 2025) ప్రారంభమైంది. ఆది, సోమవారాల్లో జెడ్డాలో జరుగనుంది. ఈసారి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్లు పాల్గొనడంతో మెగా వేలంలో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించబోతోంది. 366 మంది భారతీయులు, 208 మంది విదేశీ ఆటగాళ్లతో కూడిన ఈ మెగా వేలంలో 577 మంది ఆటగాళ్ల భవిష్యత్తు తేలనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోంది. మెగా వేలంలో 577 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరగనుంది. అయితే, గరిష్టంగా 204 మంది ఆటగాళ్లను మాత్రమే విక్రయిస్తారు. ఐపీఎల్‌లో ఇది 18వ వేలం కావడం విశేషం.
IPL 2025కి ముందు నిర్వహించే మెగా వేలం కోసం ఆటగాళ్ల నిలుపుదల (Retention), విడుదల (Release) జాబితా విడుదల చేయబడింది. గురువారం మొత్తం 10 ఫ్రాంచైజీలు ఐపీఎల్ 2025 కోసం తమను కొనసాగించాలనుకుంటున్న పేర్లను ప్రకటించగా.. అదే సమయంలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు జట్లు వదిలేశాయి.
ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆర్సీబీలోకి చేరతారన్న వార్తలు సంచలనం సృష్టించాయి. కర్ణాటకకు చెందిన ఆటగాడిని కావడంతో ఆర్‌సీబీ తరఫున ఆడాలనే కోరిక ఉంది అని తన అభిప్రాయాన్ని కేఎల్ రాహుల్ వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు మళ్లీ కోచ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (RR)కి ప్రధాన కోచ్ గా నియమితులయ్యారు. ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు.
Shikhar Dhawan: టీమిండియా స్టార్ బాట్స్మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు ఈ విషయాన్ని తన X ఖాతా ద్వారా వీడియో రూపంలో తెలిపాడు. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ భావోద్వేగానికి గురి అయ్యాడు. భారతదేశం కోసం ఆడటం తన కల నిజమైందని, ఇప్పుడు తాను ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని., తనకు మద్దతుగా నిలిచిన తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్ లకు, బీసీసీఐకి, డీడీసీఏకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.…
జూలై నెలలో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అందుకోసం బీసీసీఐ టీమ్‌ను కూడా ప్రకటించింది. జింబాబ్వేతో మొత్తం ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. జూలై 6 నుండి జూలై 14 వరకు మ్యాచ్ లు జరుగనున్నాయి. అందుకోసం టీమిండియా బయల్దేరి వెళ్లింది. అయితే.. ఇంతకుముందు ప్రకటించిన టీమిండియా జట్టులో స్వల్ప మార్పులు చేసింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి ఐపీఎల్‌లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం కల్పించింది బీసీసీఐ. ఈ టూర్ లో సంజూ…
టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ గురించి గానీ.. అతని రికార్డుల గురించి గానీ తెలియని వారు ఎవరుండరు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ ఎన్నో రికార్డులు సాధించాడు. అయితే.. ఇన్ని రికార్డులు, ప్రశంసలు అందుకున్నప్పటికీ రెండు సందర్భాల్లో తన హృదయం బద్దలైందని చెప్పారు. ఇటీవల జియో సినిమా ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాట్ కోహ్లీ.. 2016లో జరిగిన ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో తన హార్ట్ బ్రేక్ అయిందని చెప్పుకొచ్చారు.…
ఈసారి ఐపీఎల్‌లో ఆర్సీబీ టైటిల్ సాధిస్తుందనే గట్టి నమ్మకం క్రికెట్ అభిమానుల్లో ఉండేది. కానీ.. ఈసారి కూడా టైటిల్ గెలువలేకపోతుంది. సీజన్ ప్రారంభంలో అన్నీ మ్యాచ్ ల్లో ఓడిపోయి.. చివర్లో గెలుస్తూ వస్తున్నారు. కానీ.. ఆర్సీబీకి ప్లేఆఫ్స్ చేరడం కష్టమే. ఈ క్రమంలో.. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆర్సీబీకి సలహా ఇచ్చారు. భవిష్యత్తులో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే.. భారత ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. 17 ఏళ్ల నుంచి వేచి చూస్తున్న ఆర్సీబీ…
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పేసర్ మయాంక్ యాదవ్ గాయం తిరగబడినట్లు సమాచారం. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆయన 3.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆయన కోటాను నవీన్ ఉల్ హక్ పూర్తి చేశారు. మయాంక్ పూర్తిగా కోలుకోకుండానే ముంబైతో మ్యా్చ్లో ఆడించినట్లు క్రీడా నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంటనే గాయం తిరగబెట్టిందని భావిస్తున్నారు.