హైదరాబాద్ క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న తరణం రానే వచ్చింది. ఉప్పల్ లో తొలి మ్యాచ్ కు అంతా రెడీ అయ్యింది. నేడు సన్‌రైజర్స్ Vs రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది. నేడు ఉప్పల్ వేదికగా మ.3:30కి సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఐపీఎల్ 17వ సీజన్ లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18వ సీజన్ లో టైటిల్ కొట్టాలని వ్యూహాలు రచిస్తోంది. హోమ్ టౌన్ లో తొలి మ్యాచ్ లోనే బోణీ కొట్టాలని సన్ రైజర్స్ ఉవ్విళ్లూరుతోంది.
Also Read:Viveka Murder case: రంగంలోకి సిట్.. అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై విచారణ
హైదరాబాద్‌కు పాట్ కమిన్స్, రాజస్థాన్‌కు రియాన్ పరాగ్ సారథ్యం వహిస్తున్నారు. ఇరు జట్లు ప్రతిభావంతులైన ప్లేయర్స్ తో పటిష్టంగా ఉన్నాయి. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీతో ఎస్ఆర్ హెచ్ టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. రాజస్థాన్‌లో శాంసన్, యసశ్వి జై స్వాల్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హె ట్‌మెయిర్, హసరంగ, తీక్షణ, జురేల్, ఆర్చర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. రాజస్థాన్‌తో పోల్చితే సన్‌రైజర్స్ బలమైన జట్టు అనడంలో సందేహం లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో మెరుగైన ప్రదర్శన చేసి తొలి మ్యాచ్ లో విజయం సాధించాలనే పట్టుదలతో సన్ రైజర్స్ ఉంది.
Also Read:Cancer: బలభద్రపురంలో రెండో రోజు ఇంటింటి సర్వే.. భయం వద్దొంటున్న అధికారులు
ఉప్పల్ లో మ్యాచ సందర్భంగా కట్టుదిట్టమై భద్రతా ఏర్పాట్లు చేశారు. 2,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసరాల్లో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు. మహిళల భద్రత కోసం షీ టీమ్ బృందాలు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.