నవంబరులో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోకుండా ఉండిపోయాడు. అయితే.. ఇప్పుడు శార్దూల్‌కు ఐపీఎల్ 2025లో ఆడే అవకాశం లభించనుంది. దేశీయ క్రికెట్‌లో బ్యాట్, బంతితో బాగా రాణిస్తున్న శార్దూల్.. ఐపీఎల్‌లో తన ప్రతిభను చూపించే అవకాశం రానుంది.
KL Rahul: మార్చి 9న టీమిండియా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ అభిమానులకు మరో పది రోజుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మొదలు కాబోతుంది. దీనితో మరో దాదాపు 50 రోజులపాటు క్రికెట్ అభిమానులకు సందడి షురూ కానుంది. ఇక ఐపీఎల్ 2025 సీజన్ సంబంధించి ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాయి. ఇందులో భాగంగా.. ఈ రోజు (గురువారం) ఉదయం…
Mumbai Indians IPL 2025: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రాబోయే సీజన్‌కు ముందు తన జట్టును మరింత బలోపేతం చేసే క్రమంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను నియమించింది. ఈ బాధ్యతను ఇంగ్లండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన కార్ల్ హాప్కిన్సన్‌కు అప్పగించింది. 43 ఏళ్ల హాప్కిన్సన్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు గత 7 సంవత్సరాలుగా ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్ సాధించిన రెండు ప్రపంచ కప్ విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు. Also Read:…
అబుదాబి టీ10 లీగ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ వీర విహారం చేశాడు. 15 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతనిని రూ. 8.75 కోట్లకు దక్కించుకున్న ఒక రోజు తర్వాత.. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఐపీఎల్ మెగా వేలం (IPL 2025) ప్రారంభమైంది. ఆది, సోమవారాల్లో జెడ్డాలో జరుగనుంది. ఈసారి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్లు పాల్గొనడంతో మెగా వేలంలో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించబోతోంది. 366 మంది భారతీయులు, 208 మంది విదేశీ ఆటగాళ్లతో కూడిన ఈ మెగా వేలంలో 577 మంది ఆటగాళ్ల భవిష్యత్తు తేలనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోంది. మెగా వేలంలో 577 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరగనుంది. అయితే, గరిష్టంగా 204 మంది ఆటగాళ్లను మాత్రమే విక్రయిస్తారు. ఐపీఎల్‌లో ఇది 18వ వేలం కావడం విశేషం.
సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నారు. నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. బీసీసీఐ మెగా వేలంలో వేలం వేయడానికి 204 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ జాబితాలో రెండు సెట్ల మార్క్యూ ప్లేయర్‌లను తయారు చేశారు. అంతే కాకుండా.. వేలంలో ఎంపికైన 204 మంది ఆటగాళ్లలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాళ్లు, అత్యంత వయస్సు గల ఆటగాళ్లు ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం నిర్వహించనున్న మెగా వేలానికి సంబంధించి బీసీసీఐ భారీ ప్రకటన చేసింది. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో మెగా వేలం నిర్వహించనున్నారు. నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది.
IPL 2025: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌లో తన సొంత గూటికి చేందుకు సిద్దమైనట్లు సమాచారం. అతన్ని తిరిగి జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ వేలంపై టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలం ప్రక్రియను చూస్తే సంతలో పశువులను కొనుగోలు చేస్తున్న భావన కలిగిందని ఊతప్ప వ్యాఖ్యానించాడు. వస్తువుల కోసం పోటీపడుతున్నట్టుగా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీ పడ్డాయని అభిప్రాయపడ్డాడు. వేలంలో ఓ ఆటగాడిని ఏదైనా ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే ఒకే కానీ.. ఎవరూ కొనకపోతే అతడి పరిస్థితి ఎంత బాధాకరమో ఎవరూ ఊహించలేరని ఉతప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. వేలం జరిగిన తీరు…