సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నారు. నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. బీసీసీఐ మెగా వేలంలో వేలం వేయడానికి 204 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ జాబితాలో రెండు సెట్ల మార్క్యూ ప్లేయర్‌లను తయారు చేశారు. అంతే కాకుండా.. వేలంలో ఎంపికైన 204 మంది ఆటగాళ్లలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాళ్లు, అత్యంత వయస్సు గల ఆటగాళ్లు ఉన్నారు. ఇంతకు అత్యంత వయస్సు గల ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం…
Read Also: Border Gavaskar Trophy: అశ్విన్, లియోన్ మధ్య ఆధిపత్య పోరు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విజయం ఎవరిదో?
జేమ్స్ ఆండర్సన్:
ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ త్వరలో జరగనున్న వేలంలో పాల్గొంటున్న అత్యంత వయసు గల ఆటగాడు. ప్రస్తుతం అతని వయసు 42 ఏళ్లు. అతని బేస్ ధర రూ.1.25 కోట్లు. అండర్సన్ తొలిసారిగా ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్నాడు.
జామీ ఓవర్టన్:
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్‌టన్ రూ. 1.5 కోట్లకు వేలంలో నమోదు చేసుకున్నాడు. అతని వయస్సు 41 సంవత్సరాలు. బౌలింగ్‌తో పాటు భారీ షాట్‌లు కొట్టడంలో అతనికి పేరుంది. ఓవర్టన్ ఐపీఎల్‌లో ఎప్పుడూ ఆడలేదు.
ఫాఫ్ డు ప్లెసిస్:
40 ఏళ్ల ఫాఫ్ డు ప్లెసిస్ కూడా వేలంలో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి మూడు సీజన్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. డుప్లెసిస్ బేస్ ధర రూ.2 కోట్లు.
మహమ్మద్ నబీ:
మహ్మద్ నబీ ఐపీఎల్‌లో 24 మ్యాచ్‌లు ఆడాడు. 40 ఏళ్ల ఆఫ్ఘన్ ఆల్ రౌండర్ రూ. 1.5 కోట్లకు రిజిస్టర్ చేసుకున్నాడు. అతను సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ వంటి జట్ల తరుఫున ఆడాడు.
ఆర్ అశ్విన్:
భారత డాషింగ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ బేస్ ధర రూ.2 కోట్లు. 38 ఏళ్ల అశ్విన్‌ను రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) విడుదల చేసింది. ఐపీఎల్‌లో ఐదు జట్ల తరఫున 212 మ్యాచ్‌లు ఆడాడు.
డేవిడ్ వార్నర్:
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ కూడా మరోసారి వేలంలోకి అడుగుపెట్టనున్నాడు. 38 ఏళ్ల వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) వదిలేసింది. ఐపీఎల్‌లో 184 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.