IPL 2025: మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్లోకి అశ్విన్..?
- మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి రవీచంద్రన్ అశ్విన్..
- అశ్విన్ ను దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న సీఎస్కే యాజమాన్యం..
- అశ్విన్ తో పాటు రిషబ్ పంత్- డెవాన్ కాన్వేను తీసుకునేందుకు చెన్నై ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌లో తన సొంత గూటికి చేందుకు సిద్దమైనట్లు సమాచారం. అతన్ని తిరిగి జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో పది ఫ్రాంచైజీలు గురువారం తమ రిటెన్షన్ లిస్ట్ ను విడుదల చేశాయి. గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అశ్విన్‌ను ఆ జట్టు వేలంలోకి విడిచి పెట్టింది. ఆ టీమ్ మొత్తం ఆరుగుర్ని రిటైన్ చేసుకోగా.. రూ.18 కోట్లకు కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌ను రిటైన్ చేసుకోగా.. రూ. 14 కోట్లకు రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌లను అట్టిపెట్టుకుంది. అలాగే, విధ్వంసకర ఆల్‌రౌండర్ షిమ్రాన్ హెట్‌మైర్, సందీప్ శర్మను జట్టుతో పాటే కొనసాగించింది.
Read Also: Love Cheating: డబ్బుల కోసం ప్రేమ వల.. రహస్యంగా పెళ్లి.. ఫోటోలతో బ్లాక్ మెయిల్..
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఇక, ఆర్‌టీమ్ కార్డు కూడా లేకపోవడంతో అశ్విన్ తిరిగి ఆ జట్టుకు వెళ్లే ఛాన్స్ లేదు. ఈ క్రమంలోనే అతన్ని కొనుగోలు చేయాలని చెన్నై ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్(రూ. 18 కోట్లు), రవీంద్ర జడేజా(రూ. 18 కోట్లు), మతీష పతీరణ(రూ. 13 కోట్లు), శివమ్ దూబే(రూ. 12 కోట్లు), మహేంద్ర సింగ్ ధోనీ(రూ. 4 కోట్లు)లను రిటైన్ చేసుకోగా.. ఆ జట్టు వద్ద ఇంకా రూ. 55 కోట్ల పర్స్ మనీ ఉంది. రవీచంద్రన్ అశ్విన్ రూ. 5 కోట్ల ధరకు సీఎస్‌కేకు వచ్చే అవకాశం ఉంది. అయితే, అశ్విన్ 2009లో చెన్నై సూపర్ కింగ్స్‌తోనే తన ఐపీఎల్ కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత రైజింగ్ పుణే, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ఆడారు. ఇప్పటి వరకు 211 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. ఒక హాఫ్ సెంచరీతో 800 రన్స్ చేశాడు. 180 వికెట్లు తీసుకున్నాడు.
Read Also: PGCIL Recruitment: భారీగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాల భర్తీ
కాగా, డెవాన్ కాన్వేను ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఐదుగురిని మాత్రమే రిటైన్ చేసుకున్న సీఎస్‌కే దగ్గరఒక ఆర్‌టీఎమ్ కార్డ్ ఉండగా.. రిషభ్ పంత్‌ను కూడా కొనుగోలు చేసే ఆలోచనలో చెన్నై సూపర్ కింగ్స్ ఉందని కూడా ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ధోనీ స్థానాన్ని పంత్‌తో భర్తీ చేయాలనే ఆలోచనతో సీఎస్‌కే ఉన్నట్లు ప్రచారం. సీఎస్‌కే మాజీ బ్యాటర్ సురేశ్ రైనా కూడా పంత్ సీఎస్‌కేలోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు.
CHENNAI SUPER KINGS AUCTION UPDATES: [TOI]
– CSK will eye Ravichandran Ashwin in the auction.
– Devon Conway is one of preferred choices for RTM. pic.twitter.com/cYYuzkRKfp
— Johns. (@CricCrazyJohns) November 2, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!