ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటివరకు టైటిల్ కొట్టని ప్రాంచైజీలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. గత 17 సంవత్సరాలుగా ఆర్సీబీ టీమ్ ట్రోఫీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పోరాడుతున్నప్పటికీ.. సహచర ప్లేయర్స్ మద్దతు లేకపోవడంతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ టోర్నీలో అడుగుపెట్టడం.. ఒట్టి చేతులో వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ కొట్టాలని అభిమానులు చెయ్యని ప్రయత్నాలు…
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్ పాత్రపై ఇంకా స్పష్టత రాలేదు. రిషబ్ పంత్ నిష్క్రమణ తర్వాత జట్టు కొత్త కెప్టెన్ కోసం వెతుకుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాది అక్షర్ పటేల్‌తో పాటు కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌లను జట్టు కెప్టెన్ గా ఎంచుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇకపోతే, జట్టు కోసం మెగా వేలంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, ఫాఫ్ డు…
పంజాబ్ కింగ్స్ తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఆదివారం ప్రకటించింది. ఐపీఎల్ 2025లో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్‌కి కెప్టెన్సీ చేస్తే భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. రెండు కంటే ఎక్కువ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి భారత కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు.
క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఓ గుడ్ న్యూస్‌ను బీసీసీఐ చెప్పింది. ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ ను తాజాగా ప్రకటించింది. మార్చి 21వ తేదీ నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అలాగే.. మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 23 నుంచి మే 25 వరకు ఐపీఎల్-2025 జరుగుందని తెలిపారు. మొదటి మ్యాచ్‌లో చెన్నై…
Mumbai Indians IPL 2025: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రాబోయే సీజన్‌కు ముందు తన జట్టును మరింత బలోపేతం చేసే క్రమంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను నియమించింది. ఈ బాధ్యతను ఇంగ్లండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన కార్ల్ హాప్కిన్సన్‌కు అప్పగించింది. 43 ఏళ్ల హాప్కిన్సన్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు గత 7 సంవత్సరాలుగా ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్ సాధించిన రెండు ప్రపంచ కప్ విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు. Also Read:…
Mayank Agarwal: విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఫామ్‌తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. తాను మూడు వరుస మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు సాధించి సెలెక్టర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. టీమిండియాలో చోటు దక్కించుకునే క్రమంలో చాలా కష్టపడుతున్న ఈ ఆటగాడు, ఈ ట్రోఫీలో తన ప్రతిభను చాటుకుంటూ ముందుకెళ్తున్నాడు. హైదరాబాద్‌తో జరిగిన రౌండ్ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ 104 బంతుల్లో 124 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో…
Team India Schedule 2025: భారత క్రికెట్ జట్టు 2024లో అభిమానులను ఎంతగానో థ్రిల్ చేసింది. ఈ ఏడాది టీమిండియాకు కాస్త మిశ్రమ సంవత్సరం అని చెప్పవచ్చు. ఒకవైపు భారత్ 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. మరోవైపు, తొలిసారిగా స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇకపోతే, 2025లో కూడా టీమిండియా చాలా బిజీగా ఉండబోతోంది. 2025 చాలా ప్రత్యేకం కానుంది. ఎందుకంటే. 2025 సంవత్సరంలో…
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న మహీకి ఏమాత్రం ఫ్యాన్‌బేస్ తగ్గలేదు. భారత ఫాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ధోనీని అభిమానిస్తారు. ఫాన్స్ మాత్రమే కాదు.. ఐపీఎల్ యజమానులు కూడా మిస్టర్ కూల్‌ను గౌరవిస్తారు. మహీని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అభిమానిస్తారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న గోయెంకా.. ధోనీపై ప్రశంసల…
రిషబ్ పంత్, నికోలస్ పురాన్‌లలో లక్నో జట్టు తదుపరి కెప్టెన్‌గా ఎవరు ఉండాలనే దానిపై జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తన అభిప్రాయాన్ని తెలిపారు. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా.. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌కు కెప్టెన్‌ని మరికొద్ది రోజుల్లో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
అండర్-19 టెస్టులో సెంచరీ చేయడంతో వెలుగులోకి వచ్చిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన మెగా వేలంలో వైభవ్‌ను ఫ్రాంచైజీ రూ.1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది.