2022లో ఐపీఎల్‌లో కొత్తగా చేరిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో మొదటి సీజన్‌లోనే టైటిల్ సాధించి అనూహ్య విజయం సాధించింది. ఈ జట్టు ఇప్పుడు కొత్త యజమానిగా టోరెంట్ గ్రూప్‌ను పొందనుంది. ఇది రాబోయే ఐపీఎల్ సీజన్ ముందు జరుగుతుందని సమాచారం.. 2022లో ఈ జట్టును CVC క్యాపిటల్ పార్టనర్స్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం.. అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ టోరెంట్ గ్రూప్ 67 శాతం వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. ఈ ఒప్పందానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుండి తుది ఆమోదం అవసరం. కొన్ని వార్త కథనాల ప్రకారం, “టోరెంట్ గ్రూప్ ఫ్రాంచైజీలో 67 శాతం వాటాను కొనుగోలు చేయడానికి చివరి దశలో చర్చలు జరుపుతోంది. CVC గ్రూప్ యొక్క లాక్-ఇన్ వ్యవధి ఫిబ్రవరి 2025లో ముగిసిన తర్వాత.. వారు తమ వాటాను విక్రయించడానికి స్వేచ్ఛ పొందగలుగుతారు” అని PTI పేర్కొంది.
Read Also: Rammohan Naidu: యుద్ధ విమానంలో ప్రయాణించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
టోరెంట్ గ్రూప్ ప్రఖ్యాత ఫార్మా కంపెనీ
టోరెంట్ గ్రూప్ ఫార్మా రంగంలో ఎంతో ప్రఖ్యాత సంస్థగా నిలిచింది. 2021లో బిడ్స్ కోసం బీసీసీఐ ఐపీఎల్ జట్లకు ఆహ్వానించినప్పుడు ఈ సంస్థ ఆసక్తి చూపించింది. అలా యాజమాన్యానికి సంబంధించిన మార్పు జరిగితే.. దానికి బీసీసీఐ నుండి అనుమతి అవసరం అవుతుంది.
గుజరాత్ టైటాన్స్ 2022, 2023 ఐపీఎల్ ఫైనల్స్
2022, 2023 సీజన్లలో గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. 2022లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి టైటిల్ గెలిచిన గుజరాత్.. 2023లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. 2024 సీజన్‌లో శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ దక్కింది. 2024 మెగా వేలంలో గుజరాత్ జట్టు జోస్ బట్లర్, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ జట్టులో గిల్, రషీద్ ఖాన్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. అయితే.. గుజరాత్ టైటాన్స్ 2025 సీజన్‌కు మరింత బలంగా మారవచ్చని భావిస్తున్నారు. కొత్త యజమాన్యంతో జట్టు మరింత విజయాలు సాధించి.. ఐపీఎల్‌లో అగ్రస్థానంలో నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.