IPL 2025: మొదటి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించనున్న శ్రేయాస్ అయ్యర్..!
- కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన పంజాబ్ కింగ్స్
- పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్
- చరిత్ర సృష్టించనున్న శ్రేయాస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ కింగ్స్ తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఆదివారం ప్రకటించింది. ఐపీఎల్ 2025లో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్‌కి కెప్టెన్సీ చేస్తే భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. రెండు కంటే ఎక్కువ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి భారత కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు. ఇప్పటి వరకు ఇద్దరు క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. అయితే ఆ ఇద్దరు క్రికెటర్లు విదేశీయులే. తొలిసారిగా మూడు జట్లకు సారథ్యం వహించిన అవకాశం భారతీయుడికి దక్కింది.
Read Also: Jayam Ravi: నన్ను ఇక అలా పిలవద్దు.. పండుగ నాడు జయం రవి కీలక ప్రకటన
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఐపీఎల్ 2025 మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది. మొహాలీకి చెందిన ఫ్రాంచైజీ రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. శ్రేయాస్ కెప్టెన్సీలో 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. అయితే.. 18 సీజన్లలో శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ జట్టుకు 17వ కెప్టెన్.. పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు కెప్టెన్లను మార్చినంతగా మరే జట్టు మార్చలేదు.
Read Also: Breaking: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మందికి తీవ్ర గాయాలు
ఐపీఎల్‌లో మూడు జట్లకు సారథ్యం వహించిన తొలి భారత ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. శ్రేయాస్ అయ్యర్ 2018 సీజన్ మధ్య నుండి 2020 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను జట్టును ఒక సీజన్‌లో ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2022, 2024 లో KKR కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లతో ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఏకైక కెప్టెన్ కూడా ఇతనే.. శ్రేయాస్ కంటే ముందు మూడు జట్లకు మహేల జయవర్ధనే, స్టీవ్ స్మిత్ సారథ్యం వహించారు. జయవర్ధనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కొచ్చి టస్కర్స్ కేరళ, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. స్మిత్ పూణే వారియర్స్ ఇండియా, రైజింగ్ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!