ధోని తన రిటైర్మెంట్ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాడు. "నేను నా క్రికెట్ కెరీర్‌లోని చివరి కొన్ని సంవత్సరాలను ఆస్వాదించాలనుకుంటున్నాను," అని ధోని తెలిపాడు. ధోని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తప్ప మరే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడు. అయితే.. కొన్నేళ్లుగా అతని బ్యాటింగ్ ప్రదర్శనలో మార్పు వచ్చింది. కేవలం అతని అభిమానుల కోసం క్రికెట్ ఆడుతున్నట్లుగా అనిపిస్తోంది. గత సీజన్‌లో ధోని బ్యాటింగ్ లైనప్‌లో 8వ స్థానంలో దిగాడు. గత సీజన్‌లో ధోని మొత్తం 73 బంతుల్లో 161…
ఐపీఎల్ 2025 సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్ విడుదలైంది. సన్‌రైజర్స్ మార్చి 23న (ఆదివారం) రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ ఉప్పల్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది.
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ నుంచి మంచి న్యూస్ అందింది. ఐపీఎల్ (IPL 2025) ఫుల్ షెడ్యూల్ రిలీజ్ అయింది. మార్చి 22న ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL 2025) షెడ్యూల్ ఈరోజు రిలీజ్ కానుంది. కొన్ని రోజులుగా కొన్ని మ్యాచ్‌ల షెడ్యూల్ గురించి నివేదికలు వస్తున్నాయి. టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మార్చి 22న జరుగుతుందని.. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి బ్లాక్‌బస్టర్ మ్యాచ్ చేపాక్ మైదానంలో జరుగనుంది.
ముంబై ఇండియన్స్ తమ జట్టులో మార్పులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. అయితే.. అతని స్థానంలో ముంబై ఇండియన్స్.. ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్‌ను జట్టులోకి తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నారు. అది ముగిసిన వెంటనే, ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రికెట్ లీగ్ అంటే ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ వేదిక గురించి బీసీసీఐ ఇప్పటికే సమాచారం ఇచ్చినా.. తలపడే టీమ్స్ గురించి మాత్రం చెప్పలేదు. తాజా క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య లీగ్ మొదటి మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సొంత నగరమైన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మొదటి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుంది. గతేడాది రన్నరప్‌గా…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కెప్టెన్‌గా రజత్ పటీదార్ ఎంపికైన విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు నడిపించిన ఆర్సీబీకి.. పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని రజత్ సారథిగా నియమితుడు కావడం అందిరినీ ఆశ్చర్యం కలిగించే విషయమే. అంతేకాదు మూడేళ్ల ముందు ఐపీఎల్‌లో అమ్ముడే కాని ఈ 31 ఏళ్ల ఆటగాడు.. ఆర్సీబీకి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. యువ బ్యాటర్ రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ ఆర్సీబీ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. రజత్ పాటిదార్, కృనాల్ పాండ్యాలు ఆర్సీబీ కెప్టెన్ రేసులో ఉన్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో జట్టుకు సారథ్యం వహించిన దక్షిణాఫ్రికా…
2022లో ఐపీఎల్‌లో కొత్తగా చేరిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో మొదటి సీజన్లోనే టైటిల్ సాధించి అనూహ్య విజయం సాధించింది. ఈ జట్టు ఇప్పుడు కొత్త యజమానిగా టోరెంట్ గ్రూప్‌ను పొందనుంది. ఇది రాబోయే ఐపీఎల్ సీజన్ ముందు జరుగుతుందని సమాచారం.. 2022లో ఈ జట్టును CVC క్యాపిటల్ పార్టనర్స్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం.. అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ టోరెంట్ గ్రూప్ 67 శాతం వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది.