ఆస్ట్రేలియా మినిస్టర్ టిమ్ వాట్స్ విరాట్ కోహ్లీని కలిసినప్పుడు జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. విరాట్‌పై ఉన్న గౌరవంతోనే ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి తాను సపోర్టు ఇస్తున్నట్లు తెలిపారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. మెగా వేలంలో 10 జట్లు రూ.639.15 కోట్లు వెచ్చించి 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వేలంలో క్రికెట్ అభిమానుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. ఈసారి మెగా వేలంలో ఆర్సీబీ19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తాజాగా ఆర్‌సీబీ ఐపీఎల్ కి ముందే ఓ వివాదంలో చిక్కుకుంది.
తాజాగా జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పలువురు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో కేఎల్ రాహుల్, డుప్లెసిస్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించేంది. అయితే.. జట్టు అతన్ని వదులుకుంది. ఈ క్రమంలో.. జట్టు కెప్టెన్ ఎవరన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా.. మెగా వేలంలో లక్నోకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్, ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను డీసీ తమ జట్టులో చేర్చుకుంది.
IPL 2025 Captains: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 వేలం తర్వాత అన్ని జట్లు ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేలం ముందు చాలా జట్లు వేలానికి ముందే తమ జట్టు కెప్టెన్‌లను కొనసాగించగా, కొన్ని జట్లు మాత్రమే తమ మునుపటి కెప్టెన్‌లను విడుదల చేశాయి. దీనితో ఆసక్తికరంగా IPL 2025లో కొన్ని జట్లలో కొత్త కెప్టెన్లు కనిపించబోతున్నారు. మరి ఏ ఆటగాడు ఏ జట్టుకు కెప్టెన్ కాబోతున్నాడో ఒకసారి చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)…
IPL Mega Auction Unsold Players: ఎన్నో సంచనాలను క్రియేట్ చేస్తూ ఐపీఎల్ 2025 మెగా వేలం కొనసాగింది. అంచనాలకు మించి కొందరు కోట్లలో అమ్ముడుపోగా.. మరికొందరేమో పేరుకే టాప్ ప్లేయర్స్ అయినా వారిని కొనడానికి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఇష్టపడలేదు. ఇకపోతే, మెగా వేలం మొదటిరోజు ఫ్రాంఛైజీలు అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చుపెట్టిన.. రెండో రోజు మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరించాయి. ఈ నేపథ్యంలో రెండోరోజు ముఖ్యంగా భారత పేసర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. మొత్తంగా…
ఐపీఎల్ 2025కి సంబంధించి వేలం ప్రక్రియ ముగిసింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజుల పాటు జరిగిన మెగా వేలంలో 182 మంది క్రికెటర్లను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 120 మంది స్వదేశీ ప్లేయర్స్ ఉండగా.. 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మెగా వేలంలో 8 మందిని టీమ్స్ ఆర్టీఎం చేసుకున్నాయి. 10 జట్లు కలిపి 182 మంది ప్లేయర్స్ కోసం మొత్తంగా రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. ఏ జట్టులో ఏ ప్లేయర్స్…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) టీమ్ పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సత్తా ఉన్న ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. హిట్టర్లు లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, టీమ్ డేవిడ్, జితేష్ శర్మలను తీసుకుంది. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌కు తోడుగా టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను కొనుగోలు చేసింది. భారత్ బౌలర్లు కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్‌లను ఆర్‌సీబీ సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2025 వేలానికి ముందు విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్,…
ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మరోసారి అనుభవానికే పెద్దపీట వేసింది. ‘డాడీస్ ఆర్మీ’ అనే పేరుకు తగ్గట్టే.. సీనియర్ ప్లేయర్లను కొనుగోలు చేసింది. బడా స్టార్ జోలికి పోకుండా, కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టకుండా.. మంచి ఆటగాళ్లను తక్కువ ధరకే కైవసం చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సూచనలతో సీఎస్‌కే మేనేజ్మెంట్ వేలంలో తమకు కావాల్సిన ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం సీఎస్‌కేలో అనుభవ ఆటగాళ్లతో పాటు భవిష్యత్తు…
రెండు రోజుల పాటు జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తం 182 మంది క్రికెటర్లను 10 ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉండగా.. 120 మంది స్వదేశీ ప్లేయర్స్ ఉన్నారు. వేలంలో 8 మందిని టీమ్స్ ఆర్టీఎం చేసుకున్నాయి. 10 జట్లు కలిపి ప్లేయర్స్ కోసం మొత్తం రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. మన తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 మంది కొనుగోలు…
ఐపీఎల్ మెగా వేలం రెండు రోజు కొనసాగనుంది. తొలి రోజు వేలంలో ఆటగాళ్లు.. కోట్లు కొల్లగొట్టగా, ఈరోజు కూడా అదే స్థాయిలో ఆటగాళ్లు అమ్ముడుపోనున్నారు. తొలిరోజు 84 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరిగింది. ఫ్రాంచైజీలు ఆదివారం మొత్తం రూ.467.95 కోట్లు ఖర్చు చేశారు. సోమవారం కూడా పెద్ద సంఖ్యలో వేలం జరుగనుంది.