ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఉన్న జడేజా తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరారు. పుష్ప మ్యూజిక్, డైలాగ్‌తో అల్లు అర్జున్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. 'జడ్డూ అంటే పేరు కాదు బ్రాండ్' అని జడేజా చెప్పిన డైలాగ్ వీడియోను చెన్నై టీమ్ ట్వీట్ చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. లీగ్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ 2025 కోసం సిద్దమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది.…
మరో 10 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆరంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని టీమ్స్ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాయి. మరో 2-3 రోజుల్లో ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ మొదలెట్టనున్నారు. అయితే ఐపీఎల్ 2025కి సమయం దగ్గరపడుతున్నా.. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ తమ కెప్టెన్ ఎవరని ప్రకటించలేదు. కెప్టెన్సీ…
RCB Unbox Event 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ 18వ ఎడిషన్ గా జరగనుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సీజన్ మార్చి 23 నుండి ప్రారంభం కానుంది. ప్రతి సారి లాగా ఈ సారి కూడా ఐపీఎల్ లోని అన్ని జట్లు తమ జట్లను మెరుగుపరుచుకోవడానికి, కొత్త క్రీడాకారులను తీసుకోని కప్ గెలిచేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తన ఫ్యాన్స్ కోసం…
IPL 2025: భారత క్రికెట్ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఈ నెల 22 నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఎప్పటిలానే ఈసారి కూడా 10 జట్లు తమ బలాబలాలను పరీక్షించుకోనున్నాయి. యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో రసవత్తర పోటీలు జరుగనున్నాయి. అభిమానులకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందించే ఈ క్రికెట్ పండుగలో జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్‌లు జరిగే అవకాశముంది. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ మే 25న జరగనుంది. Read…
ఐపీఎల్ 2025లో రవిచంద్రన్ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరపున ఆడనున్నాడు. కాగా.. 2009లో సీఎస్కే తరుఫున అశ్విన్ అరంగేట్రం చేశాడు. 2015 వరకు ఏడు సీజన్లు చెన్నైకి ఆడాడు. ఆ తర్వాత 2016, 2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. 2018లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ను మెంటర్‌గా నియమించింది. ఫ్రాంచైజీ ఫిబ్రవరి 27 గురువారం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది.
IPL 2025 MS Dhoni: మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరుగా గుర్తింపు పొందాడు. “కూల్ కెప్టెన్” గా పేరుగాంచిన ధోనీ తన అద్భుతమైన నాయకత్వంతో భారత జట్టుకు 2007 టి20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. అంతేకాకుండా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపాడు. ధోనీ బౌలర్లను సమర్థంగా…
ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. కాగా.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. డ్వేన్ బ్రావో స్థానంలో 49 ఏళ్ల భారత మాజీ ఆల్ రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్‌కు బాధ్యతలు అప్పగించారు.
ఈ ఏడాది ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీని విడుదల చేసింది. ఈ సందర్భంగా.. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అభిమానులకు, జట్టు సభ్యులకు ప్రత్యేకమైన భావోద్వేగ సందేశం ఇచ్చాడు. పాండ్యా, ఇతర ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో కలిసి ఫ్రాంచైజీ గర్వించదగ్గ వారసత్వాన్ని నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.