MS Dhoni: ఎంఎస్ ధోనీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు: ఐపీఎల్ యజమాని
- ధోనీపై సంజీవ్ గోయెంకా ప్రశంసల వర్షం
- ధోనీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు
- నా మనవడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న మహీకి ఏమాత్రం ఫ్యాన్‌బేస్ తగ్గలేదు. భారత ఫాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ధోనీని అభిమానిస్తారు. ఫాన్స్ మాత్రమే కాదు.. ఐపీఎల్ యజమానులు కూడా మిస్టర్ కూల్‌ను గౌరవిస్తారు. మహీని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అభిమానిస్తారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న గోయెంకా.. ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు.
తాను ఎంఎస్ ధోనీతో మాట్లాడిన ప్రతిసారీ ఏదోఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటానని సంజీవ్ గోయెంకా తెలిపారు. ‘ఎంఎస్ ధోనీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు. ధోనీ ఆలోచనా విధానం, ప్రవర్తించే తీరు.. తన వయసులో ఉన్న వ్యక్తి తనను తాను ఎలా ఆవిష్కరించుకుంటాడో తెలియజేస్తుంది. శ్రీలంక యువ బౌలర్ మతిశా పతిరనను డేంజరస్ మ్యాచ్ విన్నర్‌గా తీర్చిదిద్దాడు. మహీ ఎందరో ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చాడు. మైదానంలో కీలక సూచనలు చేస్తాడు. ఆటగాళ్లను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో అతనికి బాగా తెలుసు. పరిస్థితులను హ్యాండిల్ చేయడంలో దిట్ట. నేను అతడితో మాట్లాడినప్పుడల్లా ఏదోఒక కొత్త విషయం నేర్చుకుంటా’ అని గోయెంకా చెప్పారు.
Also Read
Also Read: Siddharth-Allu Arjun: అల్లు అర్జున్‌తో ఏదైనా సమస్యా?.. సిద్ధార్థ్ సమాధానం ఇదే!
తన మనవడు, ఎంఎస్ ధోనీల మధ్య సంభాషణ గురించి కూడా సంజీవ్ గోయెంకా తెలిపారు. ‘నా మనవడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కాదు కాదు పిచ్చి. ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఎంఎస్ ధోనీతో నేను మాట్లాడాను. అప్పుడు నా మనవడు నాతోనే ఉన్నాడు. ధోనీని అనేక ప్రశ్నలు అడగాడు. ఇక చాలు అని నా మనవడిని అంటే.. మీరు ఆగండి, నేను ఈ సంభాషణను ఆస్వాదిస్తున్నా అని ధోనీ నాతో చెప్పాడు. కాసేపు నా మనవడితో మాట్లాడాడు’ అని గోయెంకా చెప్పుకొచ్చారు. ఐపీఎల్ 2025లో మహీ ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 మెగా వేలం ముందు ముందు ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ రూ.4 కోట్లకు రిటైన్ చేసుకుంది. వచ్చే ఏడాదికి అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ఐదేళ్లు కానున్న నేపథ్యంలో ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా తీసుకుంది.
- Tags
- CSK
- IPL 2025
- LSG
- ms dhoni
- Sanjiv Goenka
తాజావార్తలు
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!