చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్ గురించి ఓపెన్ అయ్యాడు. 43 ఏళ్ల ఎంఎస్ ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అప్పటి నుంచి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. గత సీజన్ తనకు చివరి సీజన్ అవుతుందని క్రికెట్ అభిమానులు భావించినప్పటికీ.. రిటైర్మెంట్‌ను ప్రకటించలేదు. 2025 సీజన్ కూడా ఆడనున్నాడు.
Read Also: Kishan Reddy : జాబ్ క్యాలెండర్‌ను అధికార కాంగ్రెస్ గాలికి వదిలేసింది
కాగా.. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ధోని తన రిటైర్మెంట్ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాడు. “నేను నా క్రికెట్ కెరీర్‌లోని చివరి కొన్ని సంవత్సరాలను ఆస్వాదించాలనుకుంటున్నాను,” అని ధోని తెలిపాడు. ధోని తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ “నా చిన్నప్పుడు క్రికెట్ ఆడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే.. ఇప్పుడు కూడా నా చివరి కొన్ని సంవత్సరాలలో క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాను,” అని చెప్పాడు. “నా స్కూల్ సమయంలో సాయంత్రం 4 గంటలకు క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాళ్ళం. అయితే.. అక్కడ వాతావరణం అనుకూలించకపోతే ఫుట్‌బాల్ కూడా ఆడేవాళ్ళం. ఇప్పుడూ అదే ఆనందాన్ని క్రికెట్‌లో పొందాలని అనుకుంటున్నాను. అయితే, అది చెప్పడం సులభం కానీ చేయడం మాత్రం కష్టమే” అని ధోని పేర్కొన్నాడు.
Read Also: Turkey : ఈ దేశంలో భూకంపానికి ఇల్లు కూలితే.. కాంట్రాక్టర్, ఇంజనీర్లకు 18ఏళ్లు జైలు
యువ క్రికెట్లర్లకు ధోని ఓ సలహా ఇచ్చాడు “మీరు ఏది మంచిదో, దాన్ని గుర్తించాలి. నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు, అది నా జీవితంలో అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. అది ఎంత ప్రభావం చూపిస్తుందో, అలాగే నా షెడ్యూల్ కూడా క్రికెట్ చుట్టూ ఉండేది,” అని ధోని చెప్పారు. “మీరు ఏది చేయాలనుకుంటున్నారో, దానికి సరైన సమయం ఉంటుంది. మీరు దాన్ని గుర్తించగలిగితే, అదే మీ కెరీర్‌కు ఉత్తమ నిర్ణయం” అని ధోని అన్నాడు. ధోని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తప్ప మరే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడు. అయితే.. కొన్నేళ్లుగా అతని బ్యాటింగ్ ప్రదర్శనలో మార్పు వచ్చింది. కేవలం అతని అభిమానుల కోసం క్రికెట్ ఆడుతున్నట్లుగా అనిపిస్తోంది. గత సీజన్‌లో ధోని బ్యాటింగ్ లైనప్‌లో 8వ స్థానంలో దిగాడు. గత సీజన్‌లో ధోని మొత్తం 73 బంతుల్లో 161 పరుగులు చేశాడు. కాగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రూ. 4 కోట్లకు నిలుపుకుంది.