ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL 2025) షెడ్యూల్ ఈరోజు రిలీజ్ కానుంది. కొన్ని రోజులుగా కొన్ని మ్యాచ్‌ల షెడ్యూల్ గురించి నివేదికలు వస్తున్నాయి. టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మార్చి 22న జరుగుతుందని.. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి బ్లాక్‌బస్టర్ మ్యాచ్ చేపాక్ మైదానంలో జరుగనుంది. కాగా.. ముంబై ఇండియన్స్ మార్చి 31న తన తొలి హోమ్ మ్యాచ్ ఆడనుంది. ఈ కొన్ని మ్యాచ్‌ల అప్ డేట్ తెలిస్తేనే.. అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే.. ఈ రోజు ఐపీఎల్ మొత్తం షెడ్యూల్ వెల్లడి కానుంది. స్టార్ స్పోర్ట్స్ ఈరోజు షెడ్యూల్ ప్రకటన గురించి తెలియజేసింది. ఐపీఎల్ 2025 షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం..
Read Also: Rashid Khan-Wasim: వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటర్..
ఐపీఎల్ (IPL 2025) షెడ్యూల్ కాసేపట్లో ప్రకటించనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు షెడ్యూల్ రిలీజ్ కానుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రకటిస్తారు. ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రత్యక్ష ప్రసారం కోసం జియో హాట్ స్టార్(JioHotstar)లో చూడవచ్చు. టీవీలో వివిధ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లతో పాటు Sports-18 Oneలో లైవ్ చూడవచ్చు.
Read Also: Minister Kollu Ravindra: తప్పు చేసి తప్పించుకోవడం కోసం మళ్ళీ తప్పు చేసి దొరికాడు