IPL 2025 RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ప్రారంభానికి ఇంకా ఒక్కరోజే ఉంది. ఈసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్యాన్స్ తమ టీమ్ ట్రోఫీ విజయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి సీజన్‌లో మాదిరిగా ఈ సీజన్‌లో కూడా ఆర్‌సిబి జట్టుకు మద్దతుగా నిలిచేందుకు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. ఇకపోతే, ఈసారి ఆర్‌సీబీ కొత్త కెప్టెన్ రజత్ పటీదార్ నాయకత్వంలో తన ప్రస్థానం మొదలు పెట్టనుంది. గత సీజన్లలో ఫాఫ్…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2025 కోసం అంపైర్ల జాబితాను ప్రకటించింది. ఈసారి ఐపీఎల్‌లో ఏడుగురు కొత్త భారతీయ అంపైర్లు తొలిసారి అధికారికంగా అంపైరింగ్ బాధ్యతలను చేపట్టనున్నారు. మరోవైపు.. సీనియర్ అంపైర్లు కుమార్ ధర్మసేన, అనిల్ చౌదరి ఈ సీజన్‌లో కనిపించరు.
IPL 2025: ఈ ఏడాది ఐపీఎల్ 2025 సీజన్ రేపటి (మార్చి 22) నుండి ప్రారంభం కానుంది. చివరగా ఫైనల్ మ్యాచ్ 25 మే 2025 న జరగనుంది. ఇందులో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో, మ్యాచ్ టై లేదా రద్దు అయినా, పాయింట్లు ఎలా ఇస్తారన్న విషయాలను…
రేపటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే ఫ్యాన్స్.. నిరంతరాయంగా మ్యాచ్‌లు చూసేందుకు తమ వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే రెండు కొత్త ప్లాన్‌లను ప్రారంభించింది.
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక కాకపోయినా.. తన ప్రదర్శనపై దృష్టి సారించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆర్సీబీ జట్టులో 7 సంవత్సరాల పాటు ఆడిన ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడనున్నాడు. తన కొత్త జట్టుకు మెరుగైన ప్రదర్శన అందించేందుకు రెడీ అవుతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత సిరాజ్ ఐపీఎల్ 2025 సీజన్‌లోకి అడుగుపెట్టనున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ‘డాడీ’ అనడంలో ఎలాంటి సందేహం లేదని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. ప్రతీ సీజన్ మరింత ఉత్సాహంగా అభిమానులను అలరిస్తోందన్నారు. ఐపీఎల్ 2025లో కచ్చితంగా 1000 సిక్స్‌లు, 300+ స్కోర్లను కూడా చూసే అవకాశం లేకపోలేదని అభిపాయపడ్డాడు. ఐపీఎల్ 18వ సీజన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఉతప్ప అన్నాడు. శనివారం (మార్చి 22) నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. ‘ఐపీఎల్ రాకతో…
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. లీగ్ మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్లే ఆఫ్స్, ఫైనల్ చేరే జట్లపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 9 మందిలో ఏకంగా ఎనమిది మంది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మద్దతు తెలిపారు. అడమ్ గిల్ క్రిస్ట్, వీరేంద్ర సెహ్వాగ్,…
జాతీయ జట్టులోకి రావాలనుకొనే భారత యువ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చక్కటి అవకాశం. ఐపీఎల్‌లో సత్తా చాటి భారత జట్టులోకి వచ్చిన జాబితా చాలానే ఉంది. సీనియర్లతో పాటు యువ క్రికెటర్లలో కూడా చాలా మంది ఐపీఎల్ ద్వారానే టీమిండియాలోకి వచ్చారు. యువ క్రికెటర్లలో శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌లు ఐపీఎల్ ద్వారానే జట్టులోకి వచ్చారు. కేవలం భారత్‌లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ ఎంతో మందికి జాతీయ…
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అంకుర సంస్థ ఎక్స్‌ఏఐ గ్రోక్ ఏఐ చాట్‌బాట్ సేవల్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ ఇస్తున్న ఆసక్తికర సమాధానాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. స్థానిక భాషలల్లో కూడా సమధానాలు ఇస్తుండటంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గ్రోక్ కొన్నింటికి కచ్చితమైన సమాధానాలు ఇస్తుండడం విశేషం. తాజాగా ఓ అభిమాని ఐపీఎల్ 2025 విజేత ఎవరు? అని అడగగా.. ఆసక్తికర సమాధానం…
టీమిండియా పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఆడిన విషయం తెలిసిందే. ఆర్సీబీలో కీలక ఆటగాడిగా ఉన్న సిరాజ్‌ను ఐపీఎల్ 2025 వేలంలో ఆ ప్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. వేలంలో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ.12.50 కోట్లకు కొనుగోలు చేసింది. కొన్నేళ్లుగా ఆర్సీబీ జట్టు ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉన్న సిరాజ్.. ప్రాంచైజీని వీడటంపై తాజాగా స్పందించాడు. విరాట్ కోహ్లీ తనకు మద్దతుగా నిలిచాడని, ఆర్సీబీని వీడటం తనను…