టీమిండియా పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఆడిన విషయం తెలిసిందే. ఆర్సీబీలో కీలక ఆటగాడిగా ఉన్న సిరాజ్‌ను ఐపీఎల్ 2025 వేలంలో ఆ ప్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. వేలంలో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ.12.50 కోట్లకు కొనుగోలు చేసింది. కొన్నేళ్లుగా ఆర్సీబీ జట్టు ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉన్న సిరాజ్.. ప్రాంచైజీని వీడటంపై తాజాగా స్పందించాడు. విరాట్ కోహ్లీ తనకు మద్దతుగా నిలిచాడని, ఆర్సీబీని వీడటం తనను…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 టైటిల్‌ను గెలుచుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రధాన పోటీదారులుగా నిలవొచ్చని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. జట్టుకు ఉన్న బలమైన బ్యాటింగ్ విభాగం, తాజా మార్పులతో హైదరాబాద్ జట్టు మరింత శక్తివంతంగా కనిపిస్తోందని అన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. అయితే.. ప్రారంభ మ్యాచ్ మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో క్రికెట్ అభిమానుల్లో నిరాశ నెలకొంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌కు సంబంధించిన కెప్టెన్ల ఫోటోషూట్ గురువారం (మార్చి 20)న ముంబైలోని ఐకానిక్ గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద జరిగింది. ఈ ఫోటోషూట్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం నిర్వహించారు.
ఐపీఎల్ 2025లో మార్చి 28న సీఎస్కే, ఆర్సీబీ తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు బద్రీనాథ్ ఆర్సీబీని ఎగతాళి చేస్తూ ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ మహా సంగ్రామం మొదలవబోతుంది. అందుకోసం అన్నీ జట్లు తమ హోంగ్రౌండ్‌లలో కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అందులో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న అభిషేక్ శర్మ.. తన అద్భుత షాట్లతో చెప్పి మరీ స్టేడియంలోని అద్దాలను పగలగొట్టాడు.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు బౌలర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. సలైవాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో.. ఈ సీజన్‌లో బౌలర్లు బంతిపై ఉమ్మి (లాలాజలం) వాడకంపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నిర్ణయం బౌలర్లకు కలిసొస్తుంది.
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడింది. వీరికి ముంబైలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ సంగ్రామం ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ తమ హోంగ్రౌండ్‌లలో ప్రాక్టీస్‌లలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మెంటర్, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు.
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు షాక్ తగిలింది. కెప్టెన్ సంజు శాంసన్ ఈ ఎడిషన్‌లో రాజస్థాన్ ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు సారథ్యం వహించడని ఆర్ఆర్ ఎక్స్ వేదికగా తెలిపింది. ఫిట్‌నెస్ సమస్య కారణంగా కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే ఆడతాడని పేర్కొంది. శాంసన్ స్థానంలో స్టార్ బ్యాటర్ రియాన్ పరాగ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ‘ఐపీఎల్ 2025లో సంజు శాంసన్ మొదటి మూడు మ్యాచ్‌లలో బ్యాటర్‌గా మాత్రమే ఆడతాడు. ఫిట్‌నెస్…