ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ ఈరోజు (మార్చి 22, శనివారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనుంది. 18వ సీజన్.. కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. అయితే.. వర్షం అభిమానుల ఉత్సాహాన్ని క్షీణింపజేస్తోంది. గత రెండు రోజులుగా కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన యాంటీ సైక్లోనిక్ ప్రసరణ కారణంగా మార్చి 22 వరకు కోల్‌కతాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ…
ప్రస్తుత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఎస్‌ఆర్‌ఎంబీ స్టీల్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యాడు. ప్రపంచ కప్ విజేత దిగ్గజ కెప్టెన్లు కపిల్ దేవ్, ఎమ్‌ఎస్ ధోనిలతో ఎలైట్ లీగ్‌లో చేరాడు. ఈ నేపథ్యంలో కొత్త బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ.. కపిల్, ధోనీలతో కలిసి ఓ యాడ్ రూపొందించారు. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు..
ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవ వేడుకలకు ఈడెన్ గార్డెన్స్ సిద్ధమవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గాయని శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా, నటి దిశా పటానీలతో కలిసి ఈడెన్ గార్డెన్స్ సిటీ వేదిక కానుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్రారంభ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సాయంత్రం 7.30 గం.కు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి.
2025 ఐపీఎల్ సీజన్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ.. వాతావరణం మార్పుల వల్ల ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది.
ఆర్సీబీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఈసారి అట్టడుగున నిలుస్తుందని జోస్యం చెప్పారు. ఆర్సీబీ అంటే తనకేమీ ద్వేషం లేదని.. కోహ్లీకి కూడా తానెప్పుడూ వ్యతిరేకం కాదన్నారు.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు తొలి రెండు మ్యాచులకు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గైర్హాజరవనున్నట్లు సమాచారం. భార్య అతియా శెట్టి తొలి బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆయన జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ జట్టులో ఆటగాడైన మిచెల్ స్టార్క్ భార్య అలీసా హీలీ ఈ విషయాన్ని తెలిపింది.
Electronics Premier League: కొత్త స్మార్ట్ టీవీ లేదా ప్రాజెక్టర్ కొనుగోలు చేసి IPL 2025 మ్యాచ్‌లను గ్రాండ్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే, అమెజాన్ ఇండియా అందిస్తున్న ప్రత్యేక డీల్స్ మిస్ కాకండి. ఇందుకోసం అమెజాన్ సరికొత్త ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్’ ను తీసుక వచ్చింది. ఈ సేల్ మార్చి 21 నుండి 26 వరకు అందుబాటులో ఉంటుంది. ఐపీఎల్ 2025 ముందు అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్‌ను ప్రకటించింది.…