ఐపీఎల్ 2025లో భాగంగా.. నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నమెంట్ 18వ సీజన్ కేకేఆర్ vs ఆర్సీబీ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. అయితే ఎప్పటినుంచో భారత్ ఫ్యాన్స్‌తో పాటు ఇతర దేశాల క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు ప్రారంభమయ్యే మొదటి మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. దీంతో.. అభిమానులు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు.
Read Also: Off The Record: కొలికపూడి మ*ర్డర్ స్కెచ్..? జనసేన కంప్లైంట్.. ఏంటి ఈ కథ..!
గత రెండు రోజులుగా కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన యాంటీ సైక్లోనిక్ ప్రసరణ కారణంగా ఈరోజు వరకు కోల్‌కతాలో ఉరుములు, మెరుపులు, వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దీంతో.. నిన్న సాయంత్రం వర్షం కారణంగా ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్లు రద్దయ్యాయి. కాగా.. ఈ ఉదయం నుండి కోల్‌కతాలో వర్షం పడే అవకాశం 90 శాతం ఉంది. అయితే గుడ్ న్యూస్ ఏమిటంటే మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం తక్కువగా ఉంది. తాజా వాతావరణ అంచనాల ప్రకారం.. వర్షం ప్రభావం మ్యాచ్ సమయానికి తగ్గిపోయే అవకాశం ఉన్నందున, అభిమానులు నిరాశ చెందకూడదు. వాతావరణం అనుకూలిస్తే, మ్యాచ్ సజావుగా సాగుతుంది.
Read Also: Off The Record: ప్రభుత్వాన్ని ప్రశ్నించారా..? ఇరుకున పెట్టారా..?