ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ నేడు ప్రారంభం కానుంది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ ప్రస్తుతం తన 18వ సీజన్‌లోకి ప్రవేశించింది. ఈ సీజన్‌లో 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. 65 రోజుల పాటు ఉత్కంఠభరితంగా కొనసాగనుంది. ఈ సీజన్‌లో నేడు తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగనుంది. అయితే.. ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌కు ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ ఇస్తారు. ఐపీఎల్ 2008 నుండి 2024 వరకు పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్న ప్రముఖ బౌలర్ల గురించి తెలుసుకుందాం. పర్పుల్ క్యాప్ అనేది ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఇస్తారు.
Read Also: Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
పాకిస్తానీ బౌలర్ పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు..
ఐపీఎల్ తొలి సీజన్‌లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్ పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ఈ బౌలర్ 11 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. మొదటి సీజన్ టైటిల్ కూడా రాజస్థాన్ రాయల్స్‌కే దక్కింది. కేవలం ఐపీఎల్ తొలి సీజన్‌లోనే పాకిస్తాన్ ఆటగాళ్లు కనిపించారు. ఆ తరువాత వారికి ఎప్పుడూ అవకాశం రాలేదు.
ఐపీఎల్ 2008: సోహైల్ తన్వీర్ (రాజస్థాన్ రాయల్స్)- 11 మ్యాచ్‌లు, 22 వికెట్లు
ఐపీఎల్ 2009: ఆర్‌పీ సింగ్ (డెక్కన్ ఛార్జర్స్)-16 మ్యాచ్‌లు, 23 వికెట్లు
ఐపీఎల్ 2010: ప్రజ్ఞాన్ ఓజా (డెక్కన్ ఛార్జర్స్)-16 మ్యాచ్‌లు, 21 వికెట్లు
ఐపీఎల్ 2011: లసిత్ మలింగ (ముంబై ఇండియన్స్)-16 మ్యాచ్‌లు, 28 వికెట్లు
ఐపీఎల్ 2012: మోర్నీ మోర్కెల్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్)- 16 మ్యాచ్‌లు, 25 వికెట్లు
ఐపీఎల్ 2013: డ్వేన్ బ్రావో (చెన్నై సూపర్ కింగ్స్)- 18 మ్యాచ్‌లు, 32 వికెట్లు
ఐపీఎల్ 2014: మోహిత్ శర్మ (చెన్నై సూపర్ కింగ్స్)- 16 మ్యాచ్‌లు, 23 వికెట్లు
ఐపీఎల్ 2015: డ్వేన్ బ్రావో (చెన్నై సూపర్ కింగ్స్)- 17 మ్యాచ్‌లు, 26 వికెట్లు
ఐపీఎల్ 2016: భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)- 17 మ్యాచ్‌లు, 23 వికెట్లు
ఐపీఎల్ 2017: భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)- 14 మ్యాచ్‌లు, 26 వికెట్లు
ఐపీఎల్ 2018: ఆండ్రూ టై (రాజస్థాన్ రాయల్స్)- 14 మ్యాచ్‌లు, 24 వికెట్లు
ఐపీఎల్ 2019: ఇమ్రాన్ తాహిర్ (చెన్నై సూపర్ కింగ్స్)- 17 మ్యాచ్‌లు, 26 వికెట్లు
ఐపీఎల్ 2020: కగిసో రబాడా (పంజాబ్)- 17 మ్యాచ్‌లు, 30 వికెట్లు
ఐపీఎల్ 2021: హర్షల్ పటేల్ (ఆర్సీబీ)- 15 మ్యాచ్‌లు, 32 వికెట్లు
ఐపీఎల్ 2022: యుజ్వేంద్ర చాహల్ (రాజస్థాన్ రాయల్స్)- 17 మ్యాచ్‌లు, 27 వికెట్లు
ఐపీఎల్ 2023: మహమ్మద్ షమీ (గుజరాత్ టైటాన్స్)- 17 మ్యాచ్‌లు, 28 వికెట్లు
ఐపీఎల్ 2024: హర్షల్ పటేల్ (పంజాబ్)- 14 మ్యాచ్‌లు, 24 వికెట్లు