ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ ఈరోజు (మార్చి 22, శనివారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనుంది. 18వ సీజన్.. కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. అయితే.. వర్షం అభిమానుల ఉత్సాహాన్ని క్షీణింపజేస్తోంది. గత రెండు రోజులుగా కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన యాంటీ సైక్లోనిక్ ప్రసరణ కారణంగా మార్చి 22 వరకు కోల్‌కతాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. నిన్న సాయంత్రం.. వర్షం కారణంగా ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్లు రద్దయ్యాయి. కానీ.. సాయంత్రం 4:00 గంటలకు కోల్‌కతాలో ఎండగా ఉంది. ఇదే వాతావరణం కొనసాగితే.. మ్యాచ్ సమయానికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
READ MORE: Nagpur Violence: నాగ్‌పూర్ అల్లర్ల నిందితులపై బుల్డోజర్ యాక్షన్, ఆస్తి నష్టం రికవరీ..
మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో 34 మ్యాచులు ఆడింది. ఇందులో 20 సార్లు విజయం అందుకుంది. ఆర్‌సీబీ జట్టుకి కేవలం 14 మ్యాచుల్లో మాత్రమే విజయం దక్కింది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేకేఆర్ అత్యధిక స్కోరు 222/6. గత ఏడాది ఈడెన్ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 222 పరుగులు చేయగా లక్ష్యఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 221 పరుగులకి ఆలౌట్ అయ్యంది. 1 పరుగు తేడాతో కేకేఆర్ థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. ఐపీఎల్‌లో అత్యల్ప స్కోరు 49 ఆలౌట్. ఈ స్కోరు కేకేఆర్‌తో మ్యాచ్‌లోనే నమోదు చేసింది ఆర్‌సీబీ.. 2017 సీజన్‌లో ఈడెన్ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా, 131 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అయితే లక్ష్యఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 49 పరుగులకే చాపచుట్టేసింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మధ్య చిరకాల వైరం కొనసాగుతోంది. ఈ మ్యాచ్ పై అటు అభిమానులు, ఇటు ప్లేయర్లు ఆశలు పెట్టుకుంటున్నారు. చివరికి ఎవరకు గెలుస్తారో వేచి చూడాల్సి ఉంది.