టీ20 క్రికెట్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 8 వేల పరుగుల మార్కును అందుకున్న ఐదవ భారత ఆటగాడిగా సూరీడు నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ 9 బంతుల్లో 27 పరుగులు చేయడంతో ఈ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేష్ రైనాలు సూర్య కంటే ముందున్నారు.
సూర్యకుమార్ యాదవ్ మరో రికార్డు కూడా ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 8 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మొదటి భారత ఆటగాడిగా సూర్యకుమార్ నిలిచాడు. 5256 బంతుల్లో 8000 టీ20 పరుగులు పూర్తి చేశాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ ముందు వరుసలో ఉన్నాడు. రస్సెల్ 4749 బంతుల్లో 8000 పరుగులు బాదాడు. టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ 288 మ్యాచ్‌లలో 8007 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 54 అర్థ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లలో 2598 పరుగులు, ఐపీఎల్‌లో 3698 పరుగులు చేశాడు.
Also Read: Rohit Sharma: ముంబైకి తలనొప్పిగా రోహిత్ శర్మ.. 2020 నుంచి ఒక్కసారి మాత్రమే!
టీ20లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్:
12976 – విరాట్ కోహ్లీ
11851 – రోహిత్ శర్మ
9797 – శిఖర్ ధావన్
8654 – సురేష్ రైనా
8007*- సూర్యకుమార్ యాదవ్