టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు వీడ్కోలు చెప్పాడు. 2025-26 సీజన్‌లో గోవాకు ఆడాలని యశస్వి నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ముంబై క్రికెట్ సంఘానికి (ఎంసీఏ) మంగళవారం యశస్వి లేఖ రాశాడు. యశస్వి నిర్ణయానికి ఎంసీఏ ఆమోదం తెలుపుతూ ఎన్‌ఓసీ కూడా మంజూరు చేసింది. గతంలో అర్జున్ టెండూల్కర్, సిద్ధేష్ లాడ్ కూడా ముంబై టీంను వీడి గోవా జట్టులో చేరిన విషయం తెలిసిందే.…
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. జోస్ బట్లర్ (73 నాటౌట్; 39 బంతుల్లో 5×4, 6×6) హాఫ్ సెంచరీ చేయగా.. సాయి సుదర్శన్ (49; 36 బంతుల్లో 7×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు బెంగళూరు 8…
RCB vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బెంగళూరు జట్టు బ్యాటింగ్‌లో ఆదిలోనే కీలక వికెట్లు…
RCB vs GT: నేడు బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రెండు జట్లు తలపడుతున్నాయి. ఇక మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఆర్‌సిబి తన సొంత మైదానంలో ఆడటం ఇదే తొలిసారి. రజత్ పాటిదార్ నేతృత్వంలోని జట్టు ఐపీఎల్ 2025 సీజన్ లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో…
IPL Records: 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్‌లలో ఒకటిగా పేరొందింది. ఐపీఎల్‌లో అనేక దిగ్గజ ఆటగాళ్లు తమ ప్రతిభను చూపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇందులో ప్రతి సీజన్‌లో కొత్త రికార్డులు, కొత్త మైలురాళ్లు నమోదవుతుంటాయి. తాజాగా 2025 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ విశేషమైన రికార్డు సాధించాడు. ఈ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ జట్టు…
Team India Captain: ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన క్రికెట్ పరిపాలనా సంస్థల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒకటి. భారత క్రికెట్‌ను పర్యవేక్షిస్తూ, జట్టును నిర్వహించే బాధ్యత బీసీసీఐకి ఉంది. దేశవాళీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారత క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇకపోతే గాయాలతో సతమతమైన శ్రేయస్ అయ్యర్, బీసీసీఐ ఆగ్రహానికి గురై భారత జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. అంతేకాకుండా, సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించబడ్డాడు. ఐపీఎల్…
సొంత మైదానం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఓడిపోవడం తమను బాధించిందని లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) మెంటార్ జహీర్ ఖాన్ తెలిపాడు. హోం గ్రౌండ్స్‌లో తమకు ఇంకా ఆరు మ్యాచ్‌లు ఉన్నాయని, తప్పకుండా అభిమానులను అలరిస్తామని చెప్పాడు. ఎకానా క్రికెట్ స్టేడియం తమకు హోం గ్రౌండ్ అయినప్పటికీ.. పంజాబ్ కింగ్స్ క్యురేటర్ ఇక్కడ ఉన్నట్లు అనిపించిందన్నాడు. తప్పకుండా రాబోయే మ్యాచుల్లో విజేతగా నిలుస్తాం అని జహీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వరుస విజయాలు అందుకున్న రెండో కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు. సారథిగా శ్రేయస్ వరుసగా 8 విజయాలు సాధించాడు. ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ విజయం సాధించడంతో శ్రేయస్ ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున సారథిగా ఆరు విజయాలు సాధించిన శ్రేయస్.. ఐపీఎల్ 2025లో పంజాబ్ తరఫున…
ఐపీఎల్ ప్రాంచైజ్ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఓనర్ సంజీవ్ గోయెంకా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్‌ఎస్‌జీ మ్యాచ్‌లో గెలిస్తే ఫర్వాలేదు కానీ.. ఓడితే మాత్రం వెంటనే మైదానంలోకి వచ్చేస్తారు. కెప్టెన్‌ను అందరి ముందూ మందలిస్తారు. కోచ్‌లు ఉన్నా సరే డ్రెస్సింగ్ రూమ్‌లోనూ ఆటగాళ్లపై మండిపడుతుంటారు. ఈ చర్యల కారణంగానే ఎల్‌ఎస్‌జీని కేఎల్ రాహుల్ వదిలివెళ్లాడు. ఐపీఎల్ 2025లో కెప్టెన్‌గా రిషభ్ పంత్ ఎంట్రీ ఇచ్చాడు. ఓ కెప్టెన్ జట్టును వీడినా.. సంజీవ్ గోయెంకా…
ఓటమి బాధలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఎల్‌ఎస్‌జీ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠిపై బీసీసీఐ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. యానిమేటెడ్ నోట్‌బుక్ సెలెబ్రేషన్స్ చేసుకున్నందుకు గాను దిగ్వేష్ మ్యాచ్ ఫ్రీజులో 25 శాతం జరిమానాను విధించింది. అంతేకాదు ఒక డీమెరిట్ పాయింట్‌ను అతడి ఖాతాలో చేర్చింది. దిగ్వేష్ తన తప్పును ఒప్పుకోవడంతో బీసీసీఐ జరిమానాతో సరిపెట్టింది. Also Read: IPL 2025: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్…