MI vs KKR: ఐపీఎల్‌లో పలు అద్భుతాలు సృష్టించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నేడు ముంబై వేదికగా నిరాశపరిచింది. ఇక మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. ఇక మ్యాచ్ మొదటి ఓవర్ నుండే వికెట్లు కోల్పోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ చివరకు 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటై అభిమానులను నిరాశపరిచింది. ఇక కేకేఆర్ బ్యాటింగ్‌లో తొలి నుంచే కష్టాలు ఎదురయ్యాయి. సునీల్ నరైన్ పరుగుల ఖాతా తెరవకుండానే ఔటవ్వగా, క్వింటన్ డి కాక్ (1) కూడా ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయాడు. కెప్టెన్ అజింక్య రహానే కూడా కేవలం 11 స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన అంక్రిష్ రఘువంశి (26) కాస్త మెరుగైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ సహకారం లభించకపోవడంతో జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది.
Read Also: Parenting Tips: తల్లితండ్రులు మీ పిల్లలకు సంబంధించిన ఈ విషయాలపై కన్నేసి ఉండాల్సిందే!
ఇక ఇన్నింగ్స్ మధ్యలో వెంకటేష్ అయ్యర్ (3), రింకు సింగ్ (17), మనీష్ పాండే (19), ఆండ్రే రస్సెల్ (5) కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. చివర్లో రమణదీప్ సింగ్ (22) కొంత సమయాన్ని క్రీజ్‌లో గడిపినా జట్టుకు భారీ స్కోరు అందించలేకపోయాడు. ఇక కేకేఆర్ బ్యాటింగ్ వైఫల్యానికి ప్రధాన కారణం ముంబై బౌలర్ల అద్భుత ప్రదర్శన. ముఖ్యంగా అశ్వనీ కుమార్ 3 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్య, మిచెల్ సాంట్నర్, వినయ్ పుత్తూర్ లు చెరో వికెట్ తీసి కేకేఆర్ ను ఒత్తిడిలోకి నెట్టారు. ఇక ఈ సీజన్ లో మొదటి విజయం సాధించడానికి ముంబై ఇండియన్స్ 117 పరుగులు చేస్తే సరిపోతుంది.