RCB vs GT: నేడు బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రెండు జట్లు తలపడుతున్నాయి. ఇక మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఆర్‌సిబి తన సొంత మైదానంలో ఆడటం ఇదే తొలిసారి. రజత్ పాటిదార్ నేతృత్వంలోని జట్టు ఐపీఎల్ 2025 సీజన్ లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆర్‌సిబి డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లను ఓడించడంతో పటిష్టంగా కనపడుతోంది. ఇక మరోవైపు శుభ్‌మాన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ జట్టు గత రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇక నేటి ప్లేయింగ్ XI ఆటగాళ్ల లిస్ట్ ఇలా ఉంది.
Read Also: IPL Records: ఐపీఎల్‌లో ధోని రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, రాహుల్ తేవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.
గుజరాత్ రిజర్వ్ ఆటగాళ్లు:
షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, వాషింగ్టన్ సుందర్.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI జట్టు:
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్‌వుడ్, యశ్ దయాల్.
ఆర్సీబీ రిజర్వ్ ఆటగాళ్లు:
సుయశ్ శర్మ, రసీఖ్ దార్, మనోజ్ భండాగే, జాకబ్ బెతెల్, స్వప్నిల్ సింగ్.