RCB vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బెంగళూరు జట్టు బ్యాటింగ్‌లో ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కేవలం 7 పరుగులకే అవుట్ అయ్యాడు. ఫిల్ సాల్ట్ (14), దేవదత్త్ పడిక్కల్ (4), కెప్టెన్ రజత్ పాటిదార్ 12 కూడా తక్కువ పరుగులకే వెనుతిరిగారు.
Read Also: Lava Bold 5G: బడ్జెట్ ధరలో.. లావా కొత్త 5G స్మార్ట్‌ఫోన్ విడుదల..
అయితే, మధ్యలో లియామ్ లివింగ్‌స్టోన్ (54 పరుగులు, 40 బంతుల్లో, 5 సిక్సర్లు) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అలాగే జితేష్ శర్మ (33 పరుగులు, 21 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో టిమ్ డేవిడ్ 32 పరుగులు చేసి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు. ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. సాయి కిషోర్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీసాడు. ప్రసిద్ క్రిష్ణ, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీసారు. అయితే రషీద్ ఖాన్ మాత్రం 4 ఓవర్లలో 54 భారీగా పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయాడు.