ఓటమి బాధలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఎల్‌ఎస్‌జీ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠిపై బీసీసీఐ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. యానిమేటెడ్ నోట్‌బుక్ సెలెబ్రేషన్స్ చేసుకున్నందుకు గాను దిగ్వేష్ మ్యాచ్ ఫ్రీజులో 25 శాతం జరిమానాను విధించింది. అంతేకాదు ఒక డీమెరిట్ పాయింట్‌ను అతడి ఖాతాలో చేర్చింది. దిగ్వేష్ తన తప్పును ఒప్పుకోవడంతో బీసీసీఐ జరిమానాతో సరిపెట్టింది.
Also Read: IPL 2025: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు దక్కని చోటు!
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ముందుగా ఎల్‌ఎస్‌జీ 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఆపై లక్ష ఛేదనలో మూడో ఓవర్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను దిగ్వేశ్ రాఠి ఔట్ చేశాడు. పెవిలియన్ వైపు వెళుతున్న ప్రియాంశ్ దగ్గరకు పరుగెత్తుకు వెళ్లి.. వెస్టిండీస్ బౌలర్ కెస్రిక్ విలియమ్స్ తరహాలో నోట్‌బుక్ సంబరాలు చేసుకున్నాడు. వెంటనే దిగ్వేశ్‌ను ఫీల్డ్ అంపైర్ మందలించాడు. మ్యాచ్ అనంతరం అతడిపై బీసీసీఐ చర్యలు తీసుకుంది.
DIGVESH RATHI DROPS AN ABSOLUTE BANGER CELEBRATION. 🤣❤️pic.twitter.com/kJWRa0xWtM
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2025