స్కోరు బోర్డుపై సరిపడా పరుగులు చేయకపోవడమే తమ ఓటమికి కారణం అని సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. గత మ్యాచ్‌లలో రెండో ఇన్నింగ్స్‌లో తడబడ్డామని, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లోనే దారుణంగా విఫలమయ్యామన్నాడు. ఇతరులను అనుకరిస్తూ.. వారి లాగానే ఆడాలనుకోవడం సరికాదన్నాడు. పరిధులు దాటి హిట్టింగ్ మాత్రమే చేయాలనే దృక్పథం తమకు లేదని, అది చేతకాదు కూడా అని మహీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్…
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్‌గా బరిలోకి దిగడంతో మహీ ఈ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఏ అన్‌క్యాప్డ్ ప్లేయర్ కెప్టెన్‌గా వ్యవహరించలేదు. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. గత ఐదేళ్లలో…
CSK vs KKR : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఘన విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు బ్యాటింగ్ విఫలమవడంతో, కోల్‌కతాకు తక్కువ స్కోరు చేధించడంలో ఎలాంటి కష్టాలూ ఎదురుకాలేదు. మ్యాచ్ ప్రారంభంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి…
చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన చెన్నై కుప్పకూలింది. 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 104 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
CSK vs KKR: చెన్నై వేదికగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్ లో తలపడనుంది. ధోని సారధ్యంలో సీజన్లో మొదటిసారి చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోతోంది. చెన్నై ఆడిన గత ఐదు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి నాలుగు మ్యాచులు ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. మరొకవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ ఐదు మ్యాచ్లలో రెండు గెలిచి, మూడు మ్యాచులు ఓడిపోయి ఆరో…
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా రుతురాజ్ 18వ సీజన్ నుంచి వైదొలిగడంతో.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ సీఎస్‌కే సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ధోనీ కెప్టెన్సీలో సీఎస్‌కే విజయాలు సాదిస్తుందని అటు మేనేజ్‌మెంట్, ఇటు ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చివరిసారి ధోనీ సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్నప్పుడు గుజరాత్ టైటాన్స్ జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై విజయం సాధించింది. మహీ…
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. రుతురాజ్ టోర్నీ నుంచి వైదొలిగడంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ సారథ్యం స్వీకరించాడు. ధోనీ కెప్టెన్సీపై రుతురాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించాడు. సీఎస్‌కేకు ఓ యంగ్ వికెట్ కీపర్ ఉన్నాడని, అతడు జట్టును ముందుకు తీసుకెళ్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. తప్పకుండా సీఎస్‌కే మళ్లీ విజయాలబాట పడుతుందని, డగౌట్ నుంచి తన…
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తనకు హోం గ్రౌండ్ అని, ఈ మైదానం పరిస్థితుల గురించి తనకంటే బాగా ఇంకా ఇంకెవరికి తెలుసు? అని ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. చిన్నస్వామి స్టేడియంలో ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా అని తెలిపాడు. స్టేడియం చిన్నదే అయినా.. పిచ్ మాత్రం సవాల్ విసురుతుంది అని చెప్పుకొచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటీదార్ తన క్యాచ్‌ను వదిలేయడం కలిసొచ్చిందని రాహుల్ తెలిపాడు. ఐపీఎల్ 2025లో…
ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఓటమి చవిచూసింది. ఆర్‌సీబీ నిర్ధేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని డీసీ 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ‘లోకల్ బాయ్’ కేఎల్ రాహుల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 7×4, 6×6) బెంగళూరు పతనాన్ని శాసించాడు. 5 పరుగుల వద్ద రాహుల్ క్యాచ్‌ను కెప్టెన్ పాటీదార్ వదిలేయడంతో ఆర్‌సీబీ భారీ మూల్యం చెల్లించుకుంది. మొదట…
RCB vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇక ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిల్ సాల్ట్ మెరుపు ఆరంభాన్ని అందించాడు. కేవలం 17 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేసి తన పవర్ హిట్టింగ్‌ను చాటిచెప్పాడు. అయితే చిన్న…