RR vs RCB: జైపూర్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు రాజస్థాన్ రాయల్స్ (RR) పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 17.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 175 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్…
RR vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్ (RR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య పోరులో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. రాజస్థాన్ రాయల్స్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఇక నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగుల స్కోర్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-28లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టుకు రజత్ పటిదార్ నాయకత్వం వహిస్తుండగా.. రాజస్థాన్ కెప్టెన్‌గా సంజు శాంసన్ ఉన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 247/2 స్కోరు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో హీరో ఓపెనర్ అభిషేక్ శర్మ. అభిషేక్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ కింగ్స్‌ను ఓడించాడు. సన్ రైజర్స్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-27లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడుతోంది. ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవాలంటే…
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) గుజరాత్ టైటాన్స్ (GT)ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఏప్రిల్ 12న (శనివారం) లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఘన విజయం సాధించింది. మొదట బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని లక్నో 4 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలుండగా ఛేదించింది. మార్‌క్రమ్ (58), నికోలస్ పూరన్…
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. గుజరాత్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. లక్నో జట్టు 6 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో రెండు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. కాగా.. టాస్ గెలిచిన రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2025లో వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో స్టార్ పేసర్ కగిసో రబాడ జట్టుకు దూరం కాగా.. తాజాగా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా దూరమయ్యాడు. గజ్జల్లో గాయం కారణంగా ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని జీటీ శనివారం అధికారికంగా తెలిపింది. అయితే ఈ సీజన్‌లో ఇంతవరకు స్టార్ ప్లేయర్ ఫిలిప్స్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం…
దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం దుమ్ము తుపానుతో పాటు మోస్తరు వర్షం కురిసింది. ఢిల్లీ నగరంలో నిన్న సాయంత్రం బలమైన ఈదురు గాలులు వీచాయి. దాంతో కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ దుమ్ము ఎఫెక్ట్ ముంబై ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ పైనా పడింది. దుమ్ము దుమారం కారణంగా ఎంఐ ప్లేయర్స్ హుటాహుటిన మైదానంను వీడాల్సి వచ్చింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం…
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) దారుణ ప్రదర్శన చేస్తోంది. ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన సీఎస్కే.. ఆపై వరుసగా ఐదు ఓటములు చవిచూసింది. హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో అయితే హ్యాట్రిక్ ఓటమిని ఎదుర్కొంది. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయాంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వం వహించినా.. సీఎస్కే రాత మారలేదు. అంతేకాదు బంతుల పరంగా ఐపీఎల్లో అత్యంత ఘోరమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వరుసగా ఐదు ఓటములతో చెన్నై ఫాన్స్…