RCB vs DC: ఆర్‌సీబీ చెత్త రికార్డు.. ఐపీఎల్ తొలి జట్టుగా!
- చిన్నస్వామి స్టేడియంలో డీసీపై ఆర్‌సీబీ ఓటమి
- ఆర్‌సీబీ ఖాతాలో ఓ చెత్త రికార్డు
- అత్యధిక పరాజయాలు చవిచూసిన తొలి జట్టుగా బెంగళూరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఓటమి చవిచూసింది. ఆర్‌సీబీ నిర్ధేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని డీసీ 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ‘లోకల్ బాయ్’ కేఎల్ రాహుల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 7×4, 6×6) బెంగళూరు పతనాన్ని శాసించాడు. 5 పరుగుల వద్ద రాహుల్ క్యాచ్‌ను కెప్టెన్ పాటీదార్ వదిలేయడంతో ఆర్‌సీబీ భారీ మూల్యం చెల్లించుకుంది. మొదట బెంగళూరు 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (37; 17 బంతుల్లో 4×4, 3×6), టిమ్ డేవిడ్ (37; 20 బంతుల్లో 2×4, 4×6) మెరుపులు మెరిపించారు.
ఆర్‌సీబీకి హోం అడ్వాంటేజ్ ఏమాత్రం కలిసి రావడం లేదు. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఐదు మ్యాచ్‌లలో 3 విజయాలు సాధించగా.. అవన్నీ బయటి మైదానాల్లోనే కావడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్‌పై చిన్నస్వామి స్టేడియంలో ఓటమితో ఆర్‌సీబీ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఒకే వేదికపై అత్యధిక పరాజయాలు చవిచూసిన తొలి జట్టుగా బెంగళూరు నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ ఇప్పటివరకు 45 మ్యాచుల్లో ఓడింది.
Also Read
- Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
అంతకుముందు ఈ చెత్త రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డీసీ 44 మ్యాచ్‌ల్లో ఓడింది. డీసీ రికార్డు ఇప్పుడు బెంగళూరు బ్రేక్ చేసింది. ఈ జాబితాలో ఈడెన్ గార్డెన్స్‌లో 38 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ మూడవ స్థానంలో ఉంది. ఇక ఐపీఎల్-18 టైటిల్ దిశగా సాగుతున్న ఆర్‌సీబీకి డీసీ కళ్లెం వేసింది. మరోవైపు ఐపీఎల్ 2025లో డీసీ జోరు కొనసాగుతోంది. మిగతా జట్లన్నీ కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడగా.. ఢిల్లీ మాత్రం అజేయంగా ఉంది.
తాజావార్తలు
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!