RCB vs DC: నేడు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇకపోతే ఢిల్లీ జట్టులో ఒక మార్పు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు…
MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ వారి జట్టుకు నాయకత్వం బాధ్యతను మరోమారు ఎంఎస్ ధోనికి కట్టబెట్టింది. రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన నేపథ్యంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మళ్లీ కెప్టెన్‌గా నియమించినట్లు సీఎస్కే యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం సీఎస్కే కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ మోచేయి ఫ్రాక్చర్‌తో ఇబ్బందిపడుతున్నాడు. మొదట్లో చిన్న గాయం అనుకున్నా..…
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. 2023లో అద్భుత ఆటతో అదరగొట్టిన జైస్వాల్.. ప్రస్తుతం పరుగులు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ 2025లో విఫలమైన అతడు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఎంపిక చేసిన భారత జట్టులో స్థానం కోల్పోయాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకేసారి హాఫ్ సెంచరీ (67) బాదాడు. ఈ నేపథ్యంలో జైస్వాల్‌కు…
ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2025లో డీసీ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన ఢిల్లీ.. మరో విజయంపై కన్నేసింది. మరోవైపు అద్భుత ఆటతో ఆర్‌సీబీ అదరగొడుతోంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లలో 3 గెలిచిన బెంగళూరు.. నాలుగో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లు జోరు మీదుండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.…
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. 18వ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన డీసీ.. మరో విజయంపై కన్నేసింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచిన ఆర్సీబీ.. నాలుగో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లు జోరు మీదుండడంతో మ్యాచ్ అభిమానులను అలరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే మ్యాచ్‌లో…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో యువ సంచలనం సాయి సుదర్శన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై వరుసగా ఐదుసార్లు 50+ స్కోర్లు చేసిన ఏకైక భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ (82; 53 బంతుల్లో 8×4, 3×6) హాఫ్ సెంచరీ బాదడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో…
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత బ్యాటింగ్‌తో ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు. దాయాది దేశం పాకిస్తాన్‌లో కూడా మనోడి ఆటకు ఫాన్స్ ఉన్నారంటే.. అతడి రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. విరాట్ కేవలం ఆటలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ కింగే. ప్రస్తుతం విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 27.1 కోట్ల మంది, ఎక్స్‌లో 6.7 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అత్యధిక ఫాలోవర్లు కలిగిన…
మైదానంలో మ్యాచ్ పరిస్థితులకు తగినట్లు బ్యాటింగ్ చేయాలనుకుంటానని, అస్సలు అహానికి పోనని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఎల్లప్పుడూ మ్యాచ్ పరిస్థితులకు తగినట్లు అర్థం చేసుకుని తాను బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు. ఎప్పుడూ ఒకరిని అధిగమించాలని చూడనని విరాట్ చెప్పుకొచ్చాడు. ఆధునిక క్రికెట్లో అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. ఐపీఎల్ 2025 సందర్భంగా టీ20 క్రికెట్లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న భారత తొలి బ్యాటర్‌గా అరుదైన ఘనతను అందుకున్నాడు. తాజాగా…
GT vs RR: ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, గుజరాత్ బ్యాటర్ల మెరుపు ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు నమోదు చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ 53 బంతుల్లో 8…