ఇంగ్లాడ్ పర్యటనకు ముందు క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే అతడు కూడా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు.
IPL In Hyderabad: ఐపీఎల్ 2025 మే 17 నుంచి మళ్లీ ప్రారంభమవుతున్నట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మే 8న ఐపీఎల్ నిలిపివేయబడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వ వర్గాలు, భద్రతా సంస్థలు, టోర్నీ నిర్వాకులతో విస్తృతంగా చర్చించిన అనంతరం మళ్లీ టోర్నీ కొనసాగించేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే కొత్త షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. Read Also:…
WTC Final: ఐపీఎల్ 2025 పొడిగింపుపై కొనసాగుతున్న సందిగ్ధత మధ్య క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తాజాగా తమ డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్) ఫైనల్, ఆ తర్వాత జరిగే వెస్టిండీస్ టూర్ కోసం జట్టును మంగళవారం అధికారికంగా ప్రకటించింది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరగనున్న ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. Read Also: Tiranga Yatra: భారత సైనికుల త్యాగాలకు గౌరవంగా దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ చేపట్టనున్న బీజేపీ.!…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మే 17 నుండి తిరిగి ప్రారంభమవుతుందని భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సోమవారం రాత్రి తెలిపింది. తొలి మ్యాచ్ ఈ నెల 17న బెంగళూరు, కోల్‌కతా మధ్య జరుగుతుంది. కొత్త షెడ్యూలు ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరుగుతుంది. మే 29న క్వాలిఫైయర్-1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మే 8న ఐపీఎల్ 2025 నిలిచిపోయిన…
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తిరిగి ప్రారంభమవుతుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తో సహా పలు ప్రముఖ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు మళ్లీ భారత్‌కు రావడం అనుమానంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం నిలిపివేయబడ్డ ఐపీఎల్‌ను మే 16న తిరిగి ప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ.. మే 30న ఫైనల్ జరపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్ సస్పెండ్ అయిన వెంటనే స్టార్క్ తన భార్య అలిస్సా హీలీతో కలిసి సిడ్నీ…
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటనతో ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. ప్రభుత్వం అనుమతిస్తే.. ఐపీఎల్ 2025 మే 16 లేదా 17న ఆరంభమయ్యే అవకాశముంది. ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణపై పాలకవర్గ సభ్యులు, బీసీసీఐ అధికారులు ఆదివారం సుదీర్ఘంగా చర్చించారు. బీసీసీఐ రీషెడ్యూలును సిద్ధం చేసే పనిలో ఉందని ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఓ ప్రకటలో తెలిపారు.…
ఐపీఎల్ 2025 పునఃప్రారంభమవుతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి భారీ షాక్ తగిలేలా ఉంది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ 2025లోని మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తోంది. భుజం గాయం ఇంకా తగ్గని కారణంగా ఆసీస్ వెళ్లిన హేజిల్‌వుడ్.. భారత్ తిరిగి వచ్చే అవకాశాలు లేవని సమాచారం. ఇదే జరిగితే ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బ తగులుతుంది. ఈ సీజన్‌లో హేజిల్‌వుడ్ 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ నిలిచే సమయానికి…
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఉన్నపళంగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే ‘కింగ్’ విరాట్ కోహ్లీ కూడా సాంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని విరాట్ బీసీసీఐకి కూడా తెలియజేశాడట. కీలకమైన ఇంగ్లండ్ పర్యటన ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని బీసీసీఐ కోరిందని సమాచారం. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, మరికొన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడాలని సూచించినట్లు…
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మధ్య ఐపీఎల్ 2025 వారం రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వాయిదా పడడం, భారత్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉందాంతో చాలా మంది విదేశీ ప్లేయర్స్, సిబ్బంది స్వదేశానికి పయనమయ్యారు. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తన స్వదేశమైన ఆస్ట్రేలియాకు బయల్దేరాడు. రికీ విమానం కూడా ఎక్కేశాడు. అయితే విమానం ఎక్కాక భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి ప్రకటన వెలువడటంతో.. వెంటనే అతడు తన…