IPL In Hyderabad: ఐపీఎల్ 2025 మే 17 నుంచి మళ్లీ ప్రారంభమవుతున్నట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మే 8న ఐపీఎల్ నిలిపివేయబడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వ వర్గాలు, భద్రతా సంస్థలు, టోర్నీ నిర్వాకులతో విస్తృతంగా చర్చించిన అనంతరం మళ్లీ టోర్నీ కొనసాగించేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే కొత్త షెడ్యూల్ ను కూడా ప్రకటించింది.
Read Also: Miss World 2025: చార్మినార్ వద్ద “హెరిటేజ్ వాక్”లో పాల్గొననున్న ప్రపంచ సుందరీమణులు.!
ఇక కొత్త షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2025లో జరగాల్సిన 17 మ్యాచ్‌లు దేశంలోని 6 ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే మే 17న బెంగళూరు వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్‌తో టోర్నీ మళ్లీ ప్రారంభమవుతుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం లీగ్ దశ మే 27న ముగియనుండగా.. మే 29న క్వాలిఫయర్-1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లు గరుగుతాయి. ఇక చివరగా ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.
ఇకపోతే, గత షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో జరగాల్సిన ఎలిమినేటర్, క్వాలిఫయర్ రెండు కీలక మ్యాచ్‌లను బీసీసీఐ తాజా షెడ్యూల్‌లో తొలగించింది. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ నగరం ప్రస్తుతం “రెడ్ జోన్” కింద ఉండటంతో భద్రతాపరంగా పూర్తి హామీ ఇవ్వలేమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అభిప్రాయపడటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో జరగాల్సిన ఒక లీగ్ మ్యాచ్‌ను కూడా ఢిల్లీకి తరలించింది. దీంతో హైదరాబాద్ అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఇక మిగతా మ్యాచ్‌లు బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీ, ముంబై వేదికలపై కొనసాగనున్నాయి. ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల ఖచ్చితమైన వేదికల వివరాలను కూడా త్వరలో ప్రకటించనున్నట్లు బోర్డు తెలిపింది.
Read Also: WTC Final: ఐపీఎల్ 2025 సందిగ్ధత మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్కు జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా..!
హైదరాబాద్ వేదికగా మ్యాచ్‌లు రద్దు కావడంపై స్థానిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నగరానికి టోర్నీలో భాగస్వామ్యం లేకుండా చేయడం తీవ్రంగా మిగిలిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అవసరమైన భద్రత కల్పించలేనన్న కారణం వల్లే హైదరాబాద్ మ్యాచ్‌లకు దూరమైనట్లు తెలుస్తోంది.