భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మధ్య ఐపీఎల్ 2025 వారం రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వాయిదా పడడం, భారత్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉందాంతో చాలా మంది విదేశీ ప్లేయర్స్, సిబ్బంది స్వదేశానికి పయనమయ్యారు. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తన స్వదేశమైన ఆస్ట్రేలియాకు బయల్దేరాడు. రికీ విమానం కూడా ఎక్కేశాడు. అయితే విమానం ఎక్కాక భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి ప్రకటన వెలువడటంతో.. వెంటనే అతడు తన నిర్ణయం మార్చుకున్నాడు. వేంటనే ప్లేన్ నుంచి కిందికి దిగి డిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.
Also Read: Preity Zinta: సురక్షితంగా ఇంటికి చేరుకున్నా.. అభిమానులకు క్షమాపణలు!
పంజాబ్ కింగ్స్ విదేశీ ఆటగాళ్లు మార్కస్ స్టాయినిస్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, బార్ట్‌లెట్ స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలిసిన రికీ పాంటింగ్.. ఆటగాళ్లతో మాట్లాడాడు. భారత్-పాక్ కాల్పుల విరమణ ప్రకటన గురించి పూర్తిగా వివరించి.. భయపడాల్సిన అవసరం లేదని చెప్పాడు. రికీ మాటలతో వారు ఇక్కడే ఉండేందుకు ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ వర్గాలు తెలిపాయి. అయితే దక్షిణాఫ్రికా పేసర్ మార్కో యాన్సెన్ మాత్రం స్వదేశానికి వెళ్లిపోయాడు. మిగతా ప్లేయర్స్ అందరూ ప్రస్తుతం జట్టుతోనే ఉన్నారు. పంజాబ్ కింగ్స్‌కు తటస్థ వేదికను ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తోంది.