టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇప్పటికే విరాట్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని బీసీసీఐకి చెప్పాడని, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందే అతడు వీడ్కోలు పలకనున్నాడని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కనీసం ఇంగ్లండ్ సిరీస్‌లో అయినా ఆడాలని కోహ్లీని ఒప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోవద్దని అటు మాజీలు, ఇటు అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో విరాట్ రిటైర్మెంట్‌పై టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు.
విరాట్ కోహ్లీ హిందుస్థాన్ కా బబ్బర్ షేర్ అని, అతడు తన టెస్ట్ కెరీర్‌ను టీ20 కెరీర్ మాదిరి ఉన్నతంగా ముగించాలని మహ్మద్ కైఫ్ సూచించాడు. ‘హిందూస్థాన్ సింహమైన విరాట్ కోహ్లీ ఇప్పుడు రిలాక్స్‌డ్ మూడ్‌లో ఉన్నాడు. అతను రిటైర్మెంట్ వైపు అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడే రిటైర్మెంట్ ఇవ్వకుండా.. ఇంగ్లండ్ వెళ్లి తానేంటో నిరూపించుకోవాలి. టెస్ట్ టెస్ట్ కెరీర్‌ను విరాట్ ఉన్నతంగా ముగించాలి. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి పొట్టి ఫార్మాట్ కెరీర్‌ను ఉన్నత స్థాయిలో ముగించాడు. అదే మాదిరి ఇప్పుడు చేయాలి’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
Also Read: IPL 2025-RCB: ఆర్సీబీకి బిగ్ షాక్..18 వికెట్లు పడగొట్టిన స్టార్ పేసర్ అవుట్!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2025లో విరాట్ కోహ్లీ విఫలమైన విషయం తెలిసిందే. 9 ఇన్నింగ్స్‌లలో 190 పరుగులే చేశాడు. అందులో ఒక సెంచరీ ఉండడం విశేషం. అప్పుడే కోహ్లీ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో పరుగుల వరద పారిస్తున్న అతడు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన కోహ్లీ 123 మ్యాచ్‌ల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ హాఫ్ సెంచరీలు ఉన్నాయి.