పలువురు భారత్ క్రికెట్ కామెంటేటర్లపై టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో కామెంటేటర్లు ఎదో ఒక ఎజెండాతో కామెంట్రీ చేస్తున్నట్లుగా ఉంటుందన్నాడు. ఇతర దేశాల కామెంట్రీ ఒక్కోసారి బాగుంటుందని, భారత్‌లో క్రికెట్ జర్నలిజం తీరు మారాల్సిన అవసరం ఉందన్నాడు. మ్యాచ్ గురించి మాట్లాడటం తక్కువైందని.. వ్యూహాలు, విశ్లేషణ అసలే లేకుండా పోయాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒకే క్రికెటర్‌పై దృష్టిపెట్టి, అతడి వ్యక్తిగత జీవితం గురించి కామెంట్లు చేయడం తగదని హిట్‌మ్యాన్…
ఐపీఎల్ 2025లో భాగంగా మే 11న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వేదిక మారింది. ధర్మశాలకు బదులు అహ్మదాబాద్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ ధృవీకరించారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ధర్మశాల విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. ఉత్తర భారతదేశంలోని చాలా విమానాశ్రయాలు మే 10 వరకు మూసివేయబడ్డాయి. పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ రోడ్డు మార్గంలో ఢిల్లీకి చేరుకుని, ఢిల్లీ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) లో 57వ మ్యాచ్ ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతోంది. ఇదిలా ఉండగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఓ వార్త కలకలం సృష్టించింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధికారిక ఇమెయిల్ ఐడికి గుర్తుతెలియని ఇమెయిల్ ఖాతా నుంచి బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది.
KKR vs CSK: నేడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఇక టాస్ గెలిచిన కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇక అజింక్య రహానే టీం అండ్ కో ప్లేఆఫ్స్ టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. ఇక మరోవైపు ప్రస్తుత సీజన్ నుండి ఎలిమినేట్ అయినా చెన్నై ఎలాగైనా మరో విజయం సాధించాలని అనుకుంటోంది. ఇక నేటి మ్యాచ్ లో కేకేఆర్ టీంలో గాయంపాలైన వెంకటేష్ అయ్యర్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) అధికారిక ఇమెయిల్‌కు ఒక బెదిరింపు మెయిల్ వచ్చింది. "మీ స్టేడియంను మేము పేల్చివేస్తాం" అని రాసి ఉంది. ఈ మెయిల్ 'పాకిస్థాన్' పేరుతో పంపారు. ఆ తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ బెదిరింపు వచ్చింది.…
Ind-Pak Tensions To Impact IPL: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తామ్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారత్ లో జరుగుతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.
MI vs GT: వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తడబడింది. గుజరాత్ టైటన్స్ బౌలర్ల దెబ్బకు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విఫలమైంది. గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచిన అనంతరం ఫీల్డింగ్ ఎంచుకోగా, ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఇన్నింగ్స్ ప్రారంభంలో ముంబైకు మంచి ఓపెనింగ్ పార్టనర్షిప్ సరిగా లభించలేదు. ఓపెనర్ రికెల్టన్ (2) రెండో బంతికే వెనుదిరిగాడు. అలాగే మరో ఓపెనర్ రోహిత్ శర్మ…
టీమిండియా క్రికెట్ ను సచిన్ ముందు, సచిన్ తర్వాత అన్నట్టుగా విడదీయొచ్చు. బౌలర్లు ఆధిపత్యం చెలాయించే ఆ రోజుల్లో ఓ పదహారేళ్ళ కుర్రాడు ప్రపంచ క్రికెట్ ని వణికించేశాడు. పదహారేళ్లకు తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసి బౌలర్లకు నైట్ మెర్ గా మారాడు. అంతకుముందు 15 ఏళ్ళ వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీ చేసి ఇండియన్ క్రికెట్లోతారాజువ్వగా దూసుకొచ్చాడు. ఇప్పుడు పద్నాలుగేళ్లకే డబుల్ సెంచరీలతో మోత మోగిస్తున్నారు. ఈ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్…
MI vs GT: ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ టాస్ గెలిచి ముంబైని ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది ప్లేఆఫ్స్ కి చేరుకుంటుంది. ఇద్దరి ఖాతాలో ప్రస్తుతం 14 పాయింట్లు ఉన్నాయి. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, గుజరాత్ జట్టు నాలుగో స్థానంలో…
RCB: ఆర్సీబీకి ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ట్రావిస్ హెడ్ నటించిన ఓ యాడ్ తమను కించపరిచేలా ఉందంటూ వేసిన పిటిషన్ ని ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఆ ప్రకటనపై ఎలాంటి జోక్యం అవసరం లేదని జస్టిస్ సౌరభ్ బెనర్జీ అన్నారు. అది కేవలం క్రీడా స్ఫూర్తికి సంబంధించిన ప్రకటన అని కోర్టు పేర్కొంది. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఈ మధ్య ఓ యాడ్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఉబర్ సంస్థతో…