హార్థిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ జైత్రయాత్రకు సన్ రైజర్స్ హైదరాబాద్ అడ్డుకట్ట వేస్తుందా అనేది వేచి చూడాలి. ఇరు జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరుగనుంది.
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే, కేకేఆర్ మ్యాచ్‌లో ఒక అద్బుత దృశ్యం చోటుచేసుకుంది. ఆదివారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయిన సంగతి తెలిసిందే. టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ సీఎస్కే కెప్టెన్ ధోనీని ఆటోగ్రాఫ్ అడగడం ఆసక్తి కలిగించింది.
ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సుయాశ్ శర్మ వేసిన ఐదో బంతిని శివమ్ దూబే ఎక్స్‌ట్రా కవర్స్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. అక్కడే కేకేఆర్ చీర్‌గర్ల్స్ కూర్చొని ఉండగా వారి వద్దకే బంతి నేరుగా వెళ్లి పడింది. బంతి వెళ్లి ఒక చీర్‌గర్ల్‌కు తాకింది. దీంతో పాపం బంతి స్పీడుగా వచ్చి తగలడంతో నొప్పితో విలవిల్లాలాడిన చీర్‌గర్ల్ బాల్ తగిలిన చోట రాసుకోవడం కనిపించింది.
రాజస్తాన్ స్పిన్నర్ అశ్విన్ రనౌట్ రూపంలో డైమండ్ డకౌట్ అయ్యాడు. డైమండ్ డకౌట్ అంటే ఎలాంటి బాల్స్ ఎదుర్కోకుండానే ఔటవ్వడం. అయితే మ్యాచ్‌లో అశ్విన్‌ను.. అనూజ్ రావత్ రనౌట్ చేసిన విధానం మహేంద్ర సింగ్ ధోనిని గుర్తుకుతెచ్చింది.
ప్లేయర్లతో ఓ మీటింగ్ న్ని ముంబై మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి నెహాల్ ఆలస్యంగా రావడం వల్లే.. అందుకే అతనికి ఈ శిక్ష విధించినట్లు పేర్కొంది. జట్టుతో పాటు, నెహాల్ కూడా సరదాగా ఈ శిక్షను అనుభవించాడు. అందుకే నేహాల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్యాడ్ వేసుకుని నడుస్తున్నది మనకు కనిపిస్తుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు కింగ్స్ సెకండ్ ఓవర్ లోనే పెద్ద షాక్ తగిలింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో రిలీ రోసో క్యాచ్ అందుకోవడంతో కెప్టెన్ శిఖర్ ధావన్ (7) ఔట్ అయ్యాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 10 పరుగులకే(1.2వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్ ( 4 )ను కూడా ఇషాంత్ శర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఐపీఎల్ 2023 ఎడిషన్ 16లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌కి చేరుకునేందుకు గుజరాత్ టైటాన్స్ ట్రై చేస్తుంది.