ఐపీఎల్ 2023 ఎడిషన్ 16లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌కి చేరుకునేందుకు గుజరాత్ టైటాన్స్ ట్రై చేస్తుంది. అదే సమయంలో ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్‌ను ఓడించడం ద్వారా ప్లేఆఫ్స్‌కు తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరీగా పోరు జరుగనుంది.
Also Read : Karnataka Elections: బీజేపీ, కుమారస్వామి మంతనాలు చేయనివ్వండి.. మాదే విజయమన్న డీకే శివకుమార్..
అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా ఐదు మ్యాచ్ ల్లో సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. అయితే ముంబై గత మూడు మ్యాచ్ ల్లో 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ను ఛేదించింది. అయితే గుజరాత్ పటిష్టమై బౌలింగ్ విభాగాన్ని కలిగి ఉంది. దీంతో ముంబై ఇండియన్స్ వారి బౌలింగ్ విభాగంలో పలు మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వారి బౌలర్లు ధారళంగా పరుగులు ఇవ్వడంతో బ్యాటింగ్ లో పటిష్టంగా రోహిత్ సేన.. బౌలింగ్ లో మాత్రం నిరాశ పరుస్తు్న్నారు.
Also Read : Niranjan Reddy: ధాన్యం ఎలావున్నా కొనాల్సిందే.. జిల్లా కలెక్టర్లకు నిరంజన్ రెడ్డి ఆదేశాలు
కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ ముంబై ఇండియన్స్ కు కొంత ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఓపెనర్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ తమ అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టును ఆదుకుంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌కి తిరిగి రావడం MIకి అతిపెద్ద సానుకూలాంశం, వీరితో పాటు కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ మరియు తిలక్ వర్మ వంటివారు ఎక్కువ పరుగులు చేస్తున్నారు.
Also Read : CBSE Class 10 Results: సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. 93.12 శాతం ఉత్తీర్ణత
అయితే మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టు అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోను అద్భుతంగా రాణిస్తుండటంతో పాటు ప్లేఆఫ్స్ కి చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు.. కానీ.. ఒకవేళ బ్యాటర్లు విఫలమైన.. బౌలర్లు విఫలమైన వారు ఈ మ్యాచ్ ఓడిపోతే ముంబై ఇండియన్స్ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇచ్చిన్నట్లు అవుతుంది. ఒకవేళ గుజరాత్ ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ కు చేరిన తొలి జట్టుగా హార్థిక్ సేన నిలుస్తుంది. పాయింట్ల పట్టికలో అఫిషియల్ గా 18 పాయిట్లలో వెళ్తుంది.
Also Read : Errabelli: కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎం మాట్లాడుతారో వాళ్ళకే తెలియదు
తుది జట్ల అంచనా :
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా, తిలక్ వర్మ, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్, కుమార్ కార్తికేయ.
గుజరాత్ టైటాన్స్ జట్టు: వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(c), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ.