ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో జైస్వాల్ పూనకం వచ్చినవాడిలా ఊగిపోయాడు. రాజస్థాన్ బ్యాటర్లలో బట్లర్ డకౌట్ కాగా మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లు (98 నాటౌట్) దుమ్ములేపాడు. అతడికి తోడు కెప్టెన్ సంజు శాంసన్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు 48 నాటౌట్‌తో దూకుడుగా ఆడడంతో రాజస్థాన్ అలవోకగా విజయ తీరాలకు చేరింది. ఈ విజయంతో రాజస్థాన్ తన ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా కోల్‌కతా అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.