ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. టాస్ గెలిచిన ఎస్ ఆర్ హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పకుండా విజయం సాధించడం ఇరు జట్లకు కీలకం కానుంది.
Also Read : Rahul Gandhi: ప్రేమతో గెలిచాం.. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది..
మేము మొదట బ్యాటింగ్ చేయబోతున్నాము అని సన్ రైజర్స్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ అన్నారు. మా సొంత గ్రౌండ్ లో విజయం సాధించేందుకు ప్రయత్నం చేస్తామని మార్ర్కామ్ అన్నారు. లక్నో సూపర్ జెయింట్స్ పై ఒత్తిడిని తీసుకువచ్చేలా ప్లాన్ చేశామని వెల్లడించాడు. మాకు బ్యాటింగ్ ఆల్ రౌండర్ (సన్వీర్ సింగ్) ఉన్నాడు – అతన్ని జట్టులోకి తీసుకున్నామని మార్ర్కమ్ అన్నారు.
Also Read : NTR 30: పది రోజుల షెడ్యూల్.. వారం రోజుల్లో ఫస్ట్ లుక్…
తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లం అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కృనాల్ పాండ్యా అన్నారు. ఒకవేళ మేం టాస్ గెలిచి ఉంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే వాళ్లమని తెలిపాడు. ఇది మాకు అప్ అండ్ డౌన్ సీజన్.. ఈ పిచ్ బాగుంది.. టీమ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ కృనాల్ పాండ్యా వెల్లడించాడు.
Also Read : Siddaramaiah: 2024లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు..
తుది జట్లు :
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్(w), కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా(సి), ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్ చరక్, అవేష్ ఖాన్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (సి), హెన్రిచ్ క్లాసెన్ (w), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హాక్ ఫరూఖీ.