Yashasvi Jaiswal Created 5 Records With His 98 Knock: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎలా విధ్వంసం సృష్టించాడో అందరికీ తెలుసు. కేవలం 13 బంతుల్లోనే అర్థశతకం సాధించిన అతగాడు.. ఓవరాల్‌గా 47 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌ల సహకారంతో 98 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇతడు ఆడిన ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ వల్లే.. కేకేఆర్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్ 41 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఛేధించింది. జట్టు విజయంలో అత్యంత కీలకంగా నిలిచిన జైస్వాల్.. ఈ క్రమంలో పలు రికార్డులను నమోదు చేశాడు. అవేంటంటే..
Sudigali Sudheer: ఏయ్ .. ఏయ్.. సుధీర్ అన్నా.. ‘బ్యాచిలర్’ భామతో రొమాన్సా..
* కేవలం 13 బంతుల్లో అర్థశతకం చేసిన జైస్వాల్.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్థశతకాన్ని నమోదు చేశాడు. ఇంతకుముందు కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు.
* టీమ్ ఓవర్స్‌తో పోలిస్తే, జైస్వాల్ చాలా త్వరగా ఈ అర్థశతకాన్ని సాధించాడు. కేవలం 2.5 (టీమ్) ఓవర్లలోనే ఈ మైల్‌స్టోన్‌ని సాధించాడు.
* నితీశ్ రానా వేసిన తొలి ఓవర్‌లో జైస్వాల్ 26 పరుగులు కొట్టి.. మొదటి ఓవర్‌లో ఇంత భారీ స్కోరు చేసిన రికార్డ్‌ని జైస్వాల్ తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు 2021లో పృథ్వీ షా 24 పరుగులు చేశాడు.
* తొలి ఓవర్‌లో 26 పరుగులు చేయడం.. ఐపీఎల్ చరిత్రలో జాయింట్-సెకండ్ హయ్యస్ట్. ఇంతకుముందు ఆర్సీబీ 2011లో ముంబై ఇండియన్స్‌పై తొలి ఓవర్‌లో 27 పరుగులు చేసింది.
* ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు నమోదు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా జైస్వాల్(575) నిలిచాడు. ఇంతకుముందు 2020లో ఇషాన్ కిషన్ 516 పరుగులు చేశాడు.
Virat – Rohit: రోహిత్, కోహ్లీల పని అయిపోయింది.. మాజీ సెలక్టర్ సంచలన ట్వీట్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులే చేసింది. వెంకటేశ్ అయ్యర్ ఒక్కడే (57) అర్థశతకంతో రాణించగా.. మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. 13.1 ఓవర్లలోనే 151 పరుగులు చేసి, చారిత్రాత్మక విజయం సాధించింది. జైస్వాల్ (98), సంజూ శాంసన్ (48) వీరవిహారం చేయడం వల్లే.. ఆర్ఆర్ ఇంతటి ఘనవిజయాన్ని నమోదు చేయగలిగింది.