ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. అయితే వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో కష్టపడకుండా అధికంగా లాభపడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే..? అది చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అని చెప్పొచ్చు.. ఈ 16.25 కోట్ల ఆటగాడు సీజన్ మొత్తంలో ఆడింది రెండే మ్యాచ్‌లు. అందులో అతను చేసిన పరుగులు కూడా 16 మాత్రమే. అంటే ఒక్కో పరుగుకు సీఎస్కే యాజమాన్యం కోటి రూపాయలపైగానే చెల్లించింది అన్న మాట.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ తీసుకుంది.
ప్లేఆఫ్స్ రేసులో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాపార్డర్ మరోసారి విఫలమైంది. దీంతో నికోలస్ పూరన్ (30 బంతుల్లో 58, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో ఆ జట్టు ఆదుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో.. 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
ఢిల్లీ వీధుల్లో మొత్తం ఎల్లో జెర్సీతో అభిమానులు మహేంద్ర సింగ్ ధోని వస్తున్న బస్సు కోసం వేచి ఉన్నారు. స్టేడియానికి వెళ్లే దారి పోడవునా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలు ధరించిన అభిమానులు ఒక దశలో ధోనిని చూడడం కోసం బస్సును కూడా వారు చుట్టుముట్టారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఈడెన్ గార్డెన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతుంది. ఈ కీలక పోరులో కోల్ కతా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ను ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిస్తే లక్నో ఎలాంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ కీలక పోరులో ఢిల్లీ క్యాపటిల్స్ పై 77 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయాన్ని అందుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఈడెన్ గార్డెన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతుంది. ఈ కీలక పోరులో కోల్ కతా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ను ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.