ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఈడెన్ గార్డెన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతుంది. ఈ కీలక పోరులో కోల్ కతా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ను ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిస్తే లక్నో ఎలాంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ 10 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.
Also Read : Naga Chaitanya: మా తాత.. ఎన్టీఆర్ గురించి ఇంట్లో అలా చెప్పేవారు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టుకు షాక్ తగిలింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో కరణ్ శర్మ(3) శార్దూల్ ఠాకూర్ చేతికి చిక్కాడు. దీంతో లక్నో 14 పరుగుల(2.3వ ఓవర్) వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కరణ్ శర్మ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ప్రేరక్ మన్కడ్ ( 20 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు ) అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మరో ఎండ్ నుంచి క్వింటన్ డికాక్ ( 27 బంతుల్లో 2సిక్సులతో 28 పరుగులు ) కూడా కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లపై కౌంటర్ ఎటాక్ చేశాడు.
Also Read : Rs.2000 Notes: విజయ్ ఆంటోని అన్నా.. నువ్వేమైనా జ్యోతిష్కుడివా..
ఇక లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. పవర్ ప్లే ( 6 ఓవర్లకు ) ముగిసే సరికి ఒక్క వికెట్ నష్టానికి 54 పరుగులు చేశారు. ఈ ఇద్దరి మధ్య 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఏడో ఓవర్ బౌలింగ్ కు వచ్చిన వైభవ్ ఆరోరా బ్యాక్ టూ బ్యాక్ రెండు వికెట్లు తీసుకుని లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కు గట్టి ఎదురు దెబ్బ కొట్టాడు. వైభవ్ అరోరా వేసిన 6.3 బాల్ కి ప్రేరక్ మన్కడ్ ( 26 ) హర్షిత్ రానాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాగా.. 6.5 బాల్ కి మార్కస్ స్టోయినీస్ ( 0) భారీ షాట్ ఆడబోయి వెంకటేశ్ అయ్యార్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
Also Read : Jharkhand: 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. గ్యాంగ్ రేప్.. వీడియో తీసి..
ఇక లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ 10 ఓవర్లలో కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయి 73 పరుగులు చేసింది. వరుస ఓవర్లలో కోల్ కతా నైటరైడర్స్ బౌలర్లు వికెట్లు తీస్తుండటంతో పరుగులు తీసేందుకు లక్నో బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు. దీంతో కేకేఆర్ బౌలర్లు వైభవ్ ఆరోరా రెండు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్ 88/5 గా ఉంది. క్రీజులో ఆయూష్ బదోని, నికోలస్ పూరన్ ఉన్నారు.