IPL 2023 : ఢిల్లీపై సీఎస్కే ఘన విజయం.. ప్లే ఆఫ్స్ కు ధోని సేన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ కీలక పోరులో ఢిల్లీ క్యాపటిల్స్ పై 77 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయాన్ని అందుకుంది. 224 పరుగుల భారీ టార్గె్ట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 149 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ ( 58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 86 పరుగులు ) ఒక్కడే అర్థ శతకంతో ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాటర్లలో పృథ్వీ షా ( 5), ఫిల్ సాల్ట్(3), రిలీ రూసో(0), అక్షర్ పటేల్ (13)లు విఫలం అయ్యారు.
Also Read : IPL 2023 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
Also Read
- ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
- Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
- Asian Games 2026: మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది.. అర్ధరాత్రి వరకు హైడ్రామా!
- India Women Cricket: 5 ఓవర్లలోనే టార్గెట్ ఉఫ్.. టీ20ల్లో భారత మహిళల జట్టు సరికొత్త రికార్డు!
ఇక.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లు తీయగా.. మతీష పతిరణ, మహేశ్ తీక్షణ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజా తల ఒక్కో వికెట్ తీసుకున్నారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ ( 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో 79 పరుగులు ) హాఫ్ సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ డేవాన్ కాన్వే ( 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్ తో 87 పరుగులు ) అద్భుతమై బ్యాటింగ్ చేశారు. వీరికి తోడు శివమ్ దూబే ( 9 బంతుల్లో 3 సిక్సులతో 22 పరుగులు ) కూడా ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పాటు చివర్లో రవీంద్ర జడేజా ( 7బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 20 పరుగులు ) అద్భుతమైన షాట్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ 223 పరుగులు మార్క్ ను చేరుకుంది. ఢిల్లీ బౌలరల్లో చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జే తలా ఓ వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో సీఎస్కే విజయం సాధించడంతో ప్లే ఆఫ్స్ కు వెళ్లిన రెండో జట్టుగా నిలిచింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ టీమ్ ఫస్ట్ ఫ్లే ఆఫ్స్ కు వెళ్లింది.
Also Read : Manchu Vishnu: స్టార్ కమెడియన్ ఇంట్లో నోట్ల కట్టలు.. గుట్టు బయటపెట్టిన మా ప్రెసిడెంట్

తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..