ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ తీసుకుంది.
Also Read : Rs.2000 Note Withdrawn: “నో ఫారమ్.. నో ఐడీ ఫ్రూఫ్”.. రూ.2000 మార్పిడిపై కీలక ప్రకటన
తాము ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్లు ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ అన్నాడు. ఈ పిచ్ కొద్దిగా పొడిగా కూడా ఉంది.. ఈ మ్యాచ్ లో షోకెన్ ఆడటం లేదు.. అతని స్థానంలో కార్తికేయ ఉన్నాడు అని రోహిత్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్స్ కు అవకాశం ఉండే అవకాశం ఉంది అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. దానికి తగ్గట్లుగానే ఏం చేయాలో టీమ్ మీటింగ్‌లో మాట్లాడుకున్నాం.. ఇక్కడి పిచ్, పరిస్థితులు ఏమిటో మాకు తెలుసు.. గెలవాలంటే బాగా ఆడాలి అని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు.
Also Read : Swapna Dutt: క్రిటిక్స్ కి నచ్చలేదేమో కానీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు…
మేము ఈ మ్యాచ్ లో గెలిచి టోర్నమెంట్ ను విజయవంతంగా ముగించాలని అనుకుంటున్నామని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ అన్నాడు. ఈ మ్యాచ్ లో కొంతమంది ఆటగాళ్లకు మరో అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ టీమ్ లో కొన్ని మార్పులు ఉన్నాయి.. ఈ పిచ్ లో ఎక్కువ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది.. ఈ మ్యాచ్ లో మేము ఓడిపోయిన ఏమీ కాదు.. కాదు కాబట్టి ఈ మ్యాచ్ లో బ్యాటర్లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేయాలని ఐడెన్ మార్క్రామ్ అన్నాడు.
Also Read : Joe Biden : జో బైడెన్ నే ఇబ్బంది పెట్టిన గొడుగు..
తుది జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(w), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్(w), హ్యారీ బ్రూక్, నితీష్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.
