బిజీబిజీగా గడిపే టీమిండియా స్టార్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన గారాలపట్టి వామికాకు సమయం కేటాయించాడు. స్విమ్మింగ్ పూల్ లో తన చిన్నారి కూతురితో కలిసి సేద తీరుతున్న ఫోటోను కోహ్లీ మంగళవారం సోషల్ మీడియాతో కలిసి పంచుకున్నాడు.
న్యూమరాలజీ ప్రకారం ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఏవో తెలుసా.. ప్రముఖ న్యూమరాలజిస్ట్ అంచనా ప్రకారం ఈ సారి ప్లే ఆఫ్స్.. ఫైనల్స్ కి చేరబోయే జట్లు ఇవేనంటా.. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్.. అని చెప్పారు.
ఐపీఎల్ లో ఇవాళ లక్నో సూపర్ జెయిట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు తలపడనున్నాయి.
కేకేఆర్ కు ఆశలే లేవు కానీ.. అనూహ్య విజయం సాధించిందంటే దానికి కారణం వెంకటేశ్ అయ్యర్ ఇన్సింగ్స్ తో పాటు రింకూ సింగ్ ది. చివరి ఓవర్ లో రింకూ సింగ్ ఐదు భారీ సిక్సులతో దుమ్మురేపాడు.
పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన బ్రూక్ 14 బంతుల్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి అర్షదీప్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడిన అతడు కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు.
శిఖర్ ధావన్ తన క్లాస్ బ్యాటింగ్ తీరుతో అందరిని ఆకట్టుకుంటుడడంతో కావ్యా మారన్ కు ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరింది. ఇదే సమయంలో ఆమె స్టాండ్స్ లో కూర్చొని సీరియస్ గా చూస్తున్న సమయంలో ఒక కెమెరామెన్ ఆమె వైపు కెమెరా తిప్పాడు. అది గమనించిన కావ్యా మారన్.. నీకు నేనే దొరికానా అన్నట్లుగా కోపంతో చల్ హట్ రే అని పేర్కొంది.